Don't Miss!
- News
కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ వారసుడు భేటీ: బీఆర్ఎస్లో..!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నదా? ప్రెగ్నెన్సీ రూమర్లు జోరుగా
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లి చేసుకొని ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను ఆస్వాదిస్తున్నది. బాలీవుడ్ యంగ్ హీరో వికీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఈ భామ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. పెళ్లి తర్వాత భరత్తో కలిసి వెకేషన్స్‌ను ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నది.
అయితే ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించి మీడియాకు, అభిమానులకు గ్లామర్ ట్రీట్ పంచింది. అయితే ఆమె ధరించిన డ్రస్ అనేక అనుమానాలకు తావిచ్చేలా చేసింది. దాంతో కత్రినా కైఫ్ గర్బం దాల్చిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ముంబై నగరం నుంచి ఎక్కడికి వెళ్లినా కత్రినా కైఫ్ ఎప్పుడూ మోడరన్ దుస్తుల్లో కనిపిస్తుంది. పొట్టిదుస్తులు, షార్ట్స్ వేసుకొని సాధారణంగా కనిపిస్తుంది. అయితే తాజాగా కత్రినా పంజాబీ డ్రస్‌లో అది కూడా లూజ్‌గా ఉన్న దుస్తులు ధరించి దర్శనమిచ్చింది. అయితే ఆమె బేబీ బంప్ (గర్బాన్ని) దాల్చినట్టు కనిపించకుండా జాగ్రత్తపడిందా అనే అనుమానాలు వచ్చాయి. దాంతో ఆమె ప్రెగ్నెంట్? అని బాలీవుడ్ మీడియా ఆరా తీసింది.

అయితే తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై కత్రినా కైఫ్ ఎలాంటి స్పందన లేకుండా జాగ్రత్త పడుతున్నది. వార్తలను ధృవీకరించకుండా చూసిచూడనట్టు వదిలేసింది. దాంతో ఆమె గర్బవతా? లేదా అనే విషయంపై ఇంకా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కత్రినా కైఫ్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఫోన్‌బూత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువ హీరోలు ఇషాన్ కట్టర్, సిద్దాంత్ చతుర్వేదితో కలిసి సందడి చేసింది. ప్రస్తుతం మనీష్ శర్మ రూపొందించే టైగర్ 3 సినిమాలో సల్మాన్ ఖాన్ పక్కన నటిస్తున్నది. స్పై థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్నారు.