Salman Khan మర్డర్‌కు కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ప్లాన్.. సింగర్ దారుణ హత్య తర్వాత షాకింగ్‌గా వెలుగులోకి!
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్దూ మూస్ వాలా అలియాస్ శుభ్ దీప్ సింగ్ దారుణ హత్య తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్‌లోని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులు విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. గతంలో పలు మార్లు సల్మాన్ ఖాన్‌ను కూడా చంపేందుకు ప్లాన్ వేశారనే విషయం తాజా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే సిద్దూ మూస్ వాలా మరణం తర్వాత తెలిసిన దిగ్బ్రాంతికరమైన విషయాలు ఏమిటంటే..

బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఏర్పాటు
సిద్దూ మూస్ వాలా మరణం అనంతరం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై తండ్రి బల్‌కౌర్ సింగ్ కేసు నమోదు చేశారు. తన ఫిర్యాదులో గతంలో చాలాసార్లు తన కుమారుడిని ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు. తన కుమారుడి ప్రాణాలకు ముప్పు ఉందనే కారణంతో బుల్లెట్ ఫ్రూఫ్ కారును ఏర్పాటు చేశాం అని చెప్పారు

వాహనంపై దారుణంగా కాల్పులు
హత్య జరిగిన రోజున దురదృష్టవశాత్తూ తన కుమారుడు సిద్దూ మూస్ వాలా బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తీసుకు వెళ్లలేదు. తన స్నేహితులు గురువిందర్ సింగ్, గురుప్రీత్ సింగ్‌తో కలిసి వ్యక్తిగత అంగరక్షకులను తన వెంట తోడ్కొని వెళ్లలేదు అని సిద్దూ మూస్ వాలా తండ్రి మీడియాకు చెప్పారు. థార్ వాహనం వెళ్తుండగా.. జవహర్‌కే గ్రామం వద్ద బొలేరో వాహనంలో వచ్చిన నలుగురు దారుణంగా కాల్పులు జరిపారు అని పేర్కొన్నారు.

గాయపడిన కొడుకును తండ్రి వాహనంలో
మహేంద్ర థార్ వాహనంలో ప్రయాణిస్తున్న సిద్దూ మూస్ వాలా, అతడి స్నేహితులపై అగంతకులు విచక్షణారాహిత్యంగా కాల్పులు జరిపారు. నేను సంఘటనా స్థలానికి చేరుకొని, నా కొడుకును మరో వాహనంలో హాస్పిటల్‌కు తరలించాను. మాన్సాకు చేరుకొనే సమయంలోపే సిద్దూ మూస్ వాలా మరణించాడని వైద్యులు ధృవీకరించారు అని తండ్రి తన ఫిర్యాదులో రాశారు. తన కొడుకు మరణం వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉందని ఆరోపించారు.

సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు కుట్ర
సిద్దూ మూస్ మరణం తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేసులో దోషులను పట్టుకొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా 2018లో సల్మాన్ ఖాన్‌ను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారు అని సిట్ పోలీసులు వెల్లడించారు.

సల్మాన్‌పై అలాంటి పగ, ప్రతీకారం
కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ నిందితుడిగా మారిన తర్వాత ఆయనను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ఓ సందర్భంలో గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్ కావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అరుదైన జంతువులను చంపినందుకు సల్మాన్ ఖాన్‌ను హతమార్చేందుకు ప్లాన్ చేసినట్టు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు వెల్లడించడంతో బాలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.


Click it and Unblock the Notifications











