Maatrubhumi: మాతృభూమి థియేటర్స్ నుంచి అవుట్! సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం మాతృభూమి: మే ది వార్ రెస్ట్ ఇన్ పీస్ (Maatrubhumi: May War Rest in Peace). ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమాను సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మించారు. ఈ సినిమాలో చిత్రంగ్ద సింగ్, అంకూర్ భాటియా, అభిశ్రీ సేన్, జేన్ షా, విపిన్ భరద్వాజ్, సిద్దార్థ్ మూలే, నిర్భయ్ చౌదరీ తదితరులు నటించారు.
ఈ సినిమాకు హిమేష్ రేషమ్మియా సంగీతం అందించారు. ఆర్ట్ డైెక్టర్‌గా స్వాప్నిల్ ఉపేల్కర్ వ్యవహరించారు. ఈ సినిమాను ఏప్రిల్ 17వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేపోయింది. అయితే ఈ సినిమా గురించి సల్మాన్ ఖాన్ తీసుకొన్న నిర్ణయం సంచలనంగా మారిందనే వార్తలు జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ మూవీ విడుదల విషయంలో సల్మాన్ ఖాన్ తీసుకొన్న నిర్ణయం వివరాల్లోకి వెళితే..

మాతృభూమి సినిమా విషయానికి వస్తే.. మొదట ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్. ఆ తర్వాత ఈ సినిమా పేరును మార్చారు. ఈ సినిమా కథను మార్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ సరిగా రాకపోవడంతో రీ షూట్స్ చేశారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమా విషయంలో అసందిగ్ధత కొనసాగడంతో థియేట్రికల్ రిలీజ్ చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అయితే సల్మాన్ ఖాన్ ఫ్యాన్ పేజ్ నుంచి వచ్చిన స్క్రీన్ షాట్స్ గందరగోళానికి దారి తీసేలా చేసింది. ఫ్యాన్స్‌లో కలవరం మొదలైంది. అయితే ఆ స్క్రీన్ షాట్‌లో మాతృభూమి చిత్రం ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలియజేయడం అనేక రూమర్లకు, ఓ సంచలనానికి బీజం పడేలా చేసింది. అయితే ఆ పోస్టు గురించి ఎలాంటి అధికారికంగా ధృవీకరణ లేకపోవడం వల్ల అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.. సల్మాన్ అభిమాని పోస్ట్ పెడుతూ.. మిస్టర్ అపూర్వ. మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న సల్మాన్ ఖాన్ అభిమానులం. మీకు ఓ రిక్వెస్ట్ ఏమిటంటే? మాతృభూమి సినిమా థియేట్రికల్ రిలీజ్ చేయాల్సిన సత్తా ఉన్న సినిమా. కాబట్టి థియేట్రికల్ రిలీజ్ చేస్తారని అనుకొంటున్నాం. ఒకవేళ కుదరకపోతే ఓటీటీలో రిలీజ్ చేయండి అని తెలిపాడు. అందుకు అపూర్వ లఖియా సమాధానం ఇస్తూ.. సల్మాన్ ఖాన్ ఇండియాలోబిగ్గెస్ట్ సూపర్ స్టార్. కాబట్టి సమయం, సందర్భాన్ని బట్టి ఓటీటీలో రిలీజ్ అవుతుంది అని చెప్పాడు. దాంతో ఈ పోస్టు అధికారికంగా వచ్చిందా? లేదా ఏఐలో జనరేట్ చేశారా? అనే చర్చ మొదలైంది.
అయితే సల్మాన్ ఖాన్ సినిమా అంటే.. బాక్సాఫీస్ సెన్సేషన్‌కు కేరాఫ్ అడ్రస్. కోట్లాది రూపాయల కనకవర్షం కురుస్తుందనే విషయం తెలిసిందే. అలాంటిది ఈ సినిమాను ఓటీటీలో ఎందుకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తారు అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. అయితే మాతృభూమి సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తే భారీ ఆఫర్ వచ్చింది. కానీ సల్మాన్ ఖాన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతోనే ఈ గందరగోళం నెలకొన్నది అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ వ్యాలీలో 2020 సంవత్సరంలో భారత, చైనా దేశాల మధ్య జరిగిన వార్ నేపథ్యంగా సాగుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో, సైన్యానికి అనువుగా లేని యుద్ధభూమిలో భారత జవాన్లు చూపించిన ధైర్యం, సాహసం, పట్టుదల, పోరాట పటిమను ఈ చిత్రంలో తెరకెక్కించారు. సల్మాన్ ఖాన్ హీరోయిజం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుందనే టాక్ వినిపించింది. పక్కాగా ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications