త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న మహేష్ హీరోయిన్.. బాలీవుడ్ హీరోతో ఎఫైర్!
సూపర్ స్టార్ మహేష్ నటించిన 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 1 నేనొక్కడినే చిత్రం విజయం సాధించకపోయినా కృతి సనన్ కు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. ఆ తరువాత ఈ భామ బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో కూడా కృతి సనన్ జోరు ఎక్కువరోజులు సాగలేదు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువగా లవ్ ఎఫర్స్, పెళ్ళికి సంబందించిన అంశాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆ జాబితాలోకి కృతి సనన్ కూడా చేరింది. త్వరలో ఈ భామ పెళ్లికూతురిగా మారబోతున్నట్లు బాలీవుడ్ లో వార్తలు జోరందుకున్నాయి.

బాలీవుడ్‌లో పెళ్లిళ్ల మోత
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో కొంత కాలంగా సోనమ్ కపూర్ ప్రేమలో ఉంది. నేడు వీరిద్దరో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది విరాట్ కోహ్లీ, అనుష్క వివాహం చేసుకున్నారు. హాట్ బ్యూటీ దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు.

కృతి సనన్ లవ్ ఎఫైర్
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ మధ్య ఘాటు ప్రేమాయణం సాగుతోంది. ప్రేమ విషయాని వీరిద్దరూ ఇంతవరకు బయటపెట్టలేదు. వీరిద్దరూ త్వరలో వివాహానికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఫ్యామిలీతో సుశాంత్ ఇంటికి
ఆదివారం రోజు కృతి సనన్ తన ఫ్యామిలీతో సుశాంత్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి గురించి చర్చించడానికే ఇరు కుటుంబ సభ్యులు కలసినట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షో రూమ్ కృతి, సుశాంత్ కలసి వెళ్లడం కూడా పెళ్లి వార్తలు బలపడడానికి కారణం.
ఫోటోలు వైరల్
కృతి సనన్ తన ఫ్యామిలీతో సుశాంత్ ఇంటికి వెళ్లిన ఫోటోలని ప్రముఖ ఫోటో గ్రాఫర్ వైరల్ భయాని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ జంట గత ఏడాది రాబ్త చిత్రంలో కలసి నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











