అదితిరావు మాజీ భర్తతో ప్రముఖ హీరోయిన్ కూతురు డేటింగ్.. భర్తకు డైవోర్స్ ఇచ్చి..
ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ప్రేమ వ్యవహారం మరోసారి మీడియాలో గుప్పుమన్నది. గతంలో మధు మంతెన అనే ప్రముఖుడితో విడాకులు తీసుకొన్న మసాబా ప్రస్తుతం హీరోయిన్ అదితిరావు హైదరీ మాజీ భర్తతో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. నీనాగుప్తా, ప్రముఖ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ సంతానమే మసాబా అనే విషయం తెలిసిందే. గతేడాది మధు నుంచి ఆమె విడాకులు తీసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే అదితిరావు మాజీ భర్తతో ప్రేమ వ్యవహారం బాలీవుడ్ మీడియాను తాకింది. వివరాల్లోకి వెళితే..

భర్తకు విడాకులిచ్చిన మసాబా
సినీ ప్రముఖుడు మధు మంతెనతో విభేదాలు తలెత్తడంతో మసాబా గుప్తా తమ దాంపత్యానికి గుడ్ బై చెప్పారు. మేమిద్దరం విడిపోవడం మా కుటుంబానికి, స్నేహితులు, సన్నిహితులంతా బాధపడ్డారు. విభేదాలు సరిద్దిదుకోలేని కారణంగా మధు విడాకులకే మొగ్గుచూపాడు. దాంతో మా తల్లిదండ్రులను, సన్నిహితులతో చర్చించిన తర్వాత విడాకులే శరణ్యమని భావించాం. దాంపత్యపరంగా విడిపోయినప్పటికీ.. వ్యక్తిగతంగా మా రిలేషన్స్‌లో ఎలాంటి తేడా ఉండదు అని మసాబా ఓ ప్రకటన చేశారు.

అదితిరావు భర్తతో రొమాన్స్
ఇక ప్రస్తుతం హీరోయిన్ అదితిరావు హైదరీ మాజీ భర్త సత్యదీప్ మిశ్రాతో ప్రేమలో మునిగి తేలుతున్నది. ఇటీవల వారిద్దరూ తమ ఇన్సాటాగ్రామ్ అకౌంట్‌లో చేసుకొన్న కామెంట్లు వారి సన్నిహిత సంబంధాలను తెలియజేశాయి. హృదయం సింబల్స్ షేర్ చేస్తూ.. ఒక హృదయం బొమ్మలు నీ ఆలోచనలు, ప్రేమకు సాక్ష్యం అంటూ సత్యదీప్ కామెంట్ చేస్తే.. అందుకు సానుకూలంగా మూడు హృదయం బొమ్మలు పెడుతూ సానుకూలంగా స్పందించింది.

అదితిరావుతో బ్రేకప్
ఇక సత్యదీప్ మిశ్రా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అదితిరావుతో 2009లో వివాహం జరిగింది. ఆ తర్వాత 2013లో వారిద్దరూ విడిపోయారు. అనంతరం అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తు ఉన్నారు. నో వన్ కిల్డ్ జెస్సికా, చిల్లర్ పార్టీ, ఫెరారీ కి సవారీ, బాంబే వెల్వెట్ లాంటి చిత్రాల్లో నటించారు. పలు టీవీ షోలలో కూడా కనిపించారు.
Recommended Video

హాట్ హాట్‌గా మసాబా అఫైర్
మసాబా, సత్యదీప్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ హాట్‌గా మారింది. అయితే అధికారికంగా ఇద్దరూ ఎక్కడ కమిట్ కాలేదు. ప్రకటించనూ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తమ ప్రేమను చెప్పి చెప్పకుండా దోబూచులాడుతున్నారు. అయితే మసాబాబ, సత్యదీప్ రిలేషన్‌షిప్, రొమాంటిక్ లైఫ్ ఓ రేంజ్‌లో ఉందనేది బాలీవుడ్ మీడియా కథనాలు వెల్లడించింది.


Click it and Unblock the Notifications











