మా అమ్మకు దీపికా అంటే ఇష్టం.. బ్రేకప్‌కు ఆమె కారణం కాదు.. ఓపెన్ అయిన రణ్‌బీర్ కపూర్

బాలీవుడ్‌లో లవ్ స్టోరీలకు కొదవే ఉండదు. లవ్ స్టోరీలు రీల్ లైఫ్‌లో తారల మధ్య కనిపించేవి కాదు.. రియల్ లైఫ్‌లో తారల మధ్య చిగురించినవి. బాలీవుడ్‌లో అలాంటి కహానీలు కోకొల్లలు. అక్కడ ప్రేమలో పడటం, బ్రేకప్‌లు జరగడం, మళ్లీ ప్రేమలో పడటం అన్నీ కామనే. అయితే అలా ఎన్నో వ్యవహారాలు ఉన్నా రణ్‌బీర్ కపూర్ మాత్రం అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తాడు. ఆయన ఓ నిత్య ప్రేమికుడు. స్టార్ హీరోయిన్లతో ప్రేమాయం నడిపించడం ఆయనకు సరదా. దీపికా, కత్రినాలతో పీకల్లోతులో పడ్డ రణ్‌బీర్ ప్రస్తుతం అలియా భట్ కొంగును పట్టుకుని తిరుగుతున్నాడు.

Recommended Video

Ranbir Kapoor About His Breakup With Deepika Padukone
 వీరి ప్రేమాయణం..

వీరి ప్రేమాయణం..

రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. రెండేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి పీఠలు కూడా ఎక్కుతారని వార్తలు వచ్చాయి. తీరా చూస్తే తనను మోసం చేశాడని రిలేషన్ షిప్ నుంచి బయటకు వచ్చేసింది దీపికా. నాటి విషయాలను గుర్తు చేసుకున్న దీపికా అనేక ఆరోపణలు చేసింది.

వేరేవారితో సంబంధాలు..

వేరేవారితో సంబంధాలు..

రణ్‌బీర్‌కే బ్రేకప్ చెప్పడానికి చాలా కారణాలున్నాయని వెల్లడిస్తూ.. రిలేషన్ షిప్‌లో ఒకసారి అవతలి వాళ్లు తప్పు చేస్తే.. మన తప్పు కూడా ఉండొచ్చని అంది. అయితే పదే పదే తప్పులు జరుగుతూ ఉంటే.. అసలు తప్పు వారిలోనే ఉంటుందని చెప్పుకొచ్చింది. తాను రెండో అవకాశం ఇవ్వడమే తన తప్పని, బతిమిలాడుకోవడం, అడుక్కోవడంతో ఇచ్చానని, అయితే అప్పటికే అందరూ చెబుతున్నారని అయినా తాను విలేదని చెప్పింది. ఒకసారి తానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని తెలిపింది.

 ఎప్పటికీ స్నేహితురాలే..

ఎప్పటికీ స్నేహితురాలే..

తాజాగా రణ్‌బీర్ మాట్లాడుతూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. దీపిక తనకు ఎప్పటికీ మిత్రురాలేనని స్పష్టం చేశాడు. తామిద్దరం విడిపోవడమనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించిందని పేర్కొన్నాడు. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందని తెలిపాడు.

మా అమ్మ కారణం కాదు..

మా అమ్మ కారణం కాదు..

అమ్మకు దీపికా అంటే ఎంతో ఇష్టమని, పైగా తన వ్యక్తిగత జీవితంలో అమ్మ జోక్యం చేసుకోదని తెలిపాడు. తానెప్పుడూ స్వతంత్ర్యంగా బతకాలని అమ్మ కోరుకుంటుందని అన్నాడు. మేమిద్దరం విడిపోవడానికి అమ్మ కారణం కాదని వెల్లడించాడు. దీపికా రణ్‌బీర్ 2009లో విడిపోయాక.. రణ్‌వీర్ సింగ్‌ను దీపికా 2018 నవంబర్‌లో పెళ్లి చేసుకుంది. రణ్‌బీర్ మాత్రం కత్రినాతో ప్రేమ వ్యవహారం నడిపి ప్రస్తుతం అలియా భట్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X