twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరీనాకు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రభుదేవా.. ఏం జరిగిందంటే!

    |

    దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా దర్శకుడిగా ప్రభుదేవా తన సత్తా చాటుతున్నాడు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన చిత్రాలు భారీ విజయాలను అందుకొన్నాయి. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ హీరోగా దబాంగ్3 చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాలో తొలుత కరీనా కపూర్‌ను హీరోయిన్‌గా అనుకొన్నారు. కానీ చిత్ర యూనిట్‌కు షాక్ ఇస్తూ కరీనాను సినిమా నుంచి తొలగిస్తూ ప్రభుదేవా నిర్ణయం తీసుకోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. కరీనాను తొలగించడం వెనుక ఆసక్తికరమైన కథనం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అదేమిటంటే..

    కరీనా కపూర్‌తో ప్రభుదేవా గొడవలు

    కరీనా కపూర్‌తో ప్రభుదేవా గొడవలు

    దబాంగ్ 2 చిత్రంలో ఫెవికాల్ సే అనే ఐటెం నంబర్‌లో కరీనాకపూర్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఆ పాట షూట్ సందర్బంగా కరీనాతో ప్రభుదేవాకు చిన్న గొడవ జరిగింది. అది పెద్దగా మారడంతో ప్రభుదేవా మనస్తాపం చెందారట. ఆ కారణంతో ఇక ముందెన్నడూ కరీనాతో పనిచేయకూడదని నిర్ణయించుకొన్నాడట. ఇక దంబాగ్‌3 సినిమాలో కరీనాను ఐటెమ్ నంబర్ నుంచి తప్పించారనేది తాజా కబురు.

    ప్రభుదేవాకు పూర్తి అధికారం అప్పగింత

    ప్రభుదేవాకు పూర్తి అధికారం అప్పగింత

    దంబాంగ్3 సినిమాపై సల్మాన్ ఖాన్ సోదరులు భారీ ఆశలు పెట్టుకొన్నారు. ప్రభుదేవాకు సినిమాకు సంబంధించిన పనులకు పూర్తి అధికారం అప్పగించారట. నటీనటులు ఎంపిక, సాంకేతిక నిపుణుల సెలెక్షన్ తదితర అంశాలను ప్రభుదేవాకే అప్పగించడంతో కరీనాను తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్నాడని బాలీవుడ్ పత్రికలు కోడైకూసాయి.

    రూమర్లపై అర్బాజ్ ఖాన్ ఖండన

    రూమర్లపై అర్బాజ్ ఖాన్ ఖండన

    అయితే కరీనాను తప్పించారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తను నిర్మాత అర్బాజ్ ఖాన్ ఖండించారు. దబాంగ్3 చిత్రంలో ఐటెం నంబర్ కోసం కరీనాను సంప్రదించలేదు. అలాగని ఆమెను ఈ సినిమా నుంచి తప్పించలేదు అని స్పష్టం చేశారు. ఈ వార్తలో వాస్తవం లేదని పేర్కొన్నారు.

    ఏప్రిల్ నుంచి రెగ్యులర్‌గా దబాంగ్3

    ఏప్రిల్ నుంచి రెగ్యులర్‌గా దబాంగ్3

    దబాంగ్3 సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్తాం. బహుశా ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభవుతుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తుంది. సల్మాన్ చులుబుల్ పాండేగా, సోనాక్షి రజ్జో పాత్రల్లో కనిపిస్తారు అని అర్బాజ్ స్పష్టం చేశారు.

    English summary
    Actress Kareena Kapoor featured in an item number called Fevicol Se in Dabangg 2, was being considered for an item number in Dabangg 3. But due to his past differences with the actress, Prabhudeva reportedly put his foot down to not direct Kareena again in his films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X