స్టార్ హీరో, హీరోయిన్ల కొడుకు మ్యారేజ్ బ్రేకప్!.. విడాకులపై జోరుగా ఊహాగానాలు

కరోనావైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో మనస్పర్ధలు వీడి అందరూ ఒక్కటవుతుంటే.. బాలీవుడ్‌లో మరో స్టార్ కపుల్ విడిపోవాలని నిశ్చయించుకొన్నట్టు తెలుస్తున్నది. ప్రముఖ నటుడు, రాజకీయ వేత్త రాజ్‌బబ్బర్, స్వర్గీయ స్మితాపాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్ వివాహంలో కలతలు చోటుచేసుకొన్నాయనే వార్త ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది. వారిద్దరి మధ్య ఏం జరుగుతున్నదనే విషయంపై మరిన్ని వివరాలు...

బీఎస్పీ నేత కుమార్తెతో పెళ్లి

బీఎస్పీ నేత కుమార్తెతో పెళ్లి

రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో నటుడిగా రాణించే ప్రయత్నాల్లో ఉన్నారు. 2018లో థియేటర్ ఆర్టిస్ట్, బీఎస్పీ నేత పవన్ సాగర్ కుమార్తె సన్యా సాగర్‌తో ప్రేమలో పడటం, ఆ ప్రేమ పెళ్లి వరకు దారి తీయడంతో అదే సంవత్సరం నిశ్చితార్థం జరిగింది. ఇక జనవరి 2019లో ఉత్తర ప్రదేశ్‌లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది.

 ప్రతీక్ పెళ్లికి రాజకీయ ప్రముఖుల హాజరు

ప్రతీక్ పెళ్లికి రాజకీయ ప్రముఖుల హాజరు

ఉత్తర ప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా రాజ్ బబ్బర్ ఉండటం కారణంగా ప్రతీక్, సన్యా పెళ్లికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలోని ప్రముఖ నేతలంతా వీరిద్దరి పెళ్లికి హాజరై దీవించారు. ఈ పెళ్లికి మాయవతి, అఖిలేష్ యాదవ్ లాంటి రాజకీయ నేతలు హాజరయ్యారు. అలా స్టార్ హోదాలో జరిగిన వీరిద్దరి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఏర్పడటం, విడిపోవడానికి నిర్ణయించుకొన్నారనేది తాజా సమాచారం.

ప్రతీక్ వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అంటూ

ప్రతీక్ వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అంటూ

ఇటీవల ప్రతీక్ బబ్బర్, సన్యా ఒకరికొకరు సోషల్ మీడియాలో తమ అకౌంట్ల నుంచి ఒకరికొకరు అన్‌ఫాలో కావడంతో ఈ రూమర్లకు బలం చేకూరింది. అంతేకాకుండా తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి హానీమూన్ ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ ఊహగానాలకు మరింత బలం పెరిగింది. అంతేకాకుండా ఇటీవల జరిగిన మ్యారేజ్ వార్షికోత్సవం సందర్భంగా వీరిద్దరూ కలుసుకోలేకపోవడం కూడా ఈ వార్తలకు ఆజ్యం పోశాయి.

సన్యా సాగర్ ఫైర్

సన్యా సాగర్ ఫైర్


ఇలా బాలీవుడ్ మీడియాలో తమ వైవాహిక జీవితంపై ఊహాగానాలు చెలరేగడంతో సన్యా తీవ్రంగా స్పందించారు. మీకు ఇలాంటి న్యూస్ ఎవరిస్తారు.. ఎక్కడ దొరుకుతుంది. ఇలాంటి విషయాలు మీ ఆనందం కోసం రాయడం తగునా అంటూ సన్యా మండిపడ్డారు. ఏదో కొన్ని విషయాలను ఆధారంగా చేసుకొని ఇలాంటి కథనాలు రాయొద్దని సన్యా సన్నిహితులు సూచించారు.

Recommended Video

Prateik Babbar's Marriage Is Going To Happen In Fantastic Way | Filmibeat Telugu
ప్రతీక్ బబ్బర్ కెరీర్

ప్రతీక్ బబ్బర్ కెరీర్

ప్రతీక్ బబ్బర్ విషయానికి వస్తే.. తాజాగా రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి నటిస్తున్న ఓ చిత్రంలో ప్రతీక్ కీలక పాత్రనుపోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 19న విడుదల కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X