రొమాంటిక్ డైరెక్టర్‌తో ప్రియాంక చోప్రా.. మళ్లీ ముంబైలో మకాం!
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉండగానే ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కు చెందిన నిక్ జోనస్‌ను వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడింది. అయితే అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. ఆమె ఫోకస్ అంతా హాలీవుడ్ సినిమాలపైనే పెట్టింది. అయితే దాంపత్య జీవితం, యాక్టింగ్ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకొంటూ వస్తున్న ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌పై మరోసారి కన్నేసింది. ఈ ప్రముఖ దర్శకుడితో మూవీని చేసేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అందుకు ఇటీవల ఆమె నర్మగర్భంగా చెప్పిన మాటలే అందుకు సాక్ష్యంగా నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే..
నిక్ జోనస్‌తో డేటింగ్ చేస్తూ అమెరికాలో మకాం పెట్టిన ప్రియాంక చోప్రా 2017లో బేవాచ్ అనే సీరిస్‌లో నటించింది. ఆ తర్వా తఏ కిడ్ లైక్ జేక్, ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్, ఛేజింగ్ హ్యాపీనెస్ లాంటి చిత్రాల్లో నటించింది. అలాగే హ్యాపీనెస్ కంటిన్యూ, వీ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ లాంటి సినిమాల్లో నటించింది.

ఇక 2021 సంవత్సరంలో హాలీవుడ్‌లో భారీ అంచనాలతో వచ్చిన ది మ్యాట్రిక్స్ రీసర్రెక్షన్స్, లవ్ అగైన్, టైగర్, హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే ప్రాజెక్టులతో భాగమైంది. ఇదిలా ఉండగా, ఉమెన్ ఆఫ్ మై బిలియన్ అనే డాక్యుమెంటరీని నిర్మించింది. ఈ డాక్యుమెంటరీ గురించి ఇటీవల ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా ఈవెంట్‌లో లుక్‌ను రిలీజ్ చేసింది.
అయితే హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించేందుకు సిద్దమవుతున్నానని చెప్పకనే చెప్పింది. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలో తాను నటించనున్నానని పరోక్షంగా వెల్లడించింది. అయితే త్వరలోనే ఆ ప్రాజెక్టు వివరాలను అధికారికంగా వెల్లడిస్తాం అని ఆమె మీడియాతో చెప్పారు.

గతంలో సంజయ్ లీలా భన్సాలీ చిత్రాల్లో ప్రియాంక చోప్రా నటించిన విషయం తెలిసిందే. రామ్ లీలా చిత్రం స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. అలాగే బాజీరావు మస్తానీ సినిమాలో కూడా ప్రధాన పాత్రను పోషించింది. ఆమె బాలీవుడ్‌లో నటించిన చివరి చిత్రాల విషయానికి వసత్ే.. జై గంగాజల్ ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత మరాఠీ చిత్రం వెంటిలేటర్ సినిమాలో గెస్ట్ రోల్‌లో నటించింది.


Click it and Unblock the Notifications











