‘సూపర్ స్టార్‌తో ప్రియాంక చోప్రా శృంగారలీలలు.. ఈర్ష్యతో కరణ్ జోహర్ చేసిన కుట్ర ఏమిటంటే?’
సినిమా రంగంలో హీరోలకు, హీరోయిన్లకు సంబంధించిన రూమర్లు, గాపిస్స్‌కు భలే క్రేజ్ ఉంటుంది. ఇక స్టార్ హీరోలు, హీరోయిన్ల డేటింగ్, అఫైర్, సహజీవనం గురించిన వార్తల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా, స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్‌కు లింకున్న రూమర్లకు మంచి డిమాండే ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో బాలీవుడ్ క్రిటిక్ చేసిన ట్వీట్ ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..

షారుక్ ఖాన్, కరణ్ జోహర్ గురించి
సూపర్ స్టార్ షారుక్ ఖాన్, కరణ్ జోహర్ కెరీర్ దాదాపు ఒకే సమయంలో టేకాఫ్ అయ్యాయి. షారుక్, కరణ్ మధ్య వ్యక్తిగత బంధం చాలా బలమైనదిగా కనిపిస్తాయి. ఆరంభంలో కరణ్ జోహర్ తన సినిమాలను కేవలం షారుక్ ఖాన్‌తోనే తీయడం తెలిసిందే. షారుక్, కరణ్ జోహర్ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ లభించింది.

కరణ్ జోహర్ తన కెరీర్‌లో
కరణ్ జోహర్ తన కెరీర్‌లో దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువగా షారుక్ ఖాన్‌తోనే తీయడం గమనార్హం. తన తొలి సినిమా కుచ్ కుచ్ హోతా హై, కబీ ఖుషీ కబీ ఘమ్, కల్ హో నా హో, కభీ అల్విదా నా కహ్నా, మై నేమ్ ఈజ్ ఖాన్ లాంటి సినిమాలను షారుక్‌తో కరణ్ జోహర్ రూపొందించారు.

కరణ్, షారుక్ బంధంపై అలాంటి కామెంట్స్
అయితే ఇటీవల కాలంలో షారుక్ ఖాన్‌తో కరణ్ జోహర్ సినిమాలు పెద్దగా రాకపోయినా వారిద్దరి మధ్య బంధాన్ని ప్రత్యేకంగా చర్చించుకొంటారు. కాఫీ విత్ కరణ్ షోలో ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ ప్రస్తావిస్తూ.. మీ రిలేషన్ గురించి బాలీవుడ్‌లో గొప్పగా చెప్పుకొంటారు. మీరు ఒకవేళ సినిమా తీస్తే నాతో తీయరు.. షారుక్‌తోనే తీస్తారు అంటూ దెప్పి పొవడం అప్పట్లో వైరల్‌గా మారింది.

ప్రియాంక చోప్రాపై కరణ్ కుట్ర?
అయితే షారుక్, కరణ్ జోహర్ మధ్య రిలేషన్ గురించి దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేస్తూ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. డాన్2 సినిమా షూటింగులో షారుక్ ఖాన్‌తో పడకగదిలో ప్రియాంక రాసలీలలు జరిపింది. ఆ విషయం చూసి కరణ్ ఈర్షకు గురయ్యాడు.
ఆ సమయంలో ప్రియాంక, షారుక్ ఖాన్ నిజంగా లవ్‌లో ఉన్నారు. ఆ తర్వాత సహించలేని కరణ్ జోహర్.. బాలీవుడ్ నుంచి ప్రియాంకను తరిమివేయడానికి కుట్ర పన్నారు. కరణ్ నిజస్వరూపం అదే అని ఉమేర్ సంధూ ట్వీట్‌లో తెలిపారు.

ప్రియాంక చోప్రా మూవీ కెరీర్
ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌కు దూరమై చాలా రోజులు అవుతున్నది. నిక్ జోనస్‌ను వివాహం చేసుకొన్న తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యింది. హాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తున్నది. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28 తేదీన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నది.


Click it and Unblock the Notifications











