Marriage: రాఖీ సావంత్ కాబోయే భర్త పాకిస్థానీ కాదా? అల్రెడీ పెళ్లైందా? మ్యారేజ్‌కు ముందే షాకింగ్ లీక్స్!

బాలీవుడ్ హాట్ బ్యూటీ, ఐటెమ్ గర్ల్ రాఖీ సావంత్ మూడోసారి పెళ్లికి సిద్దమయ్యారు. ఈసారి పాకిస్థానీ నటుడు, పోలీస్ ఆఫీసర్ దోడి ఖాన్‌ను వివాహం చేసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఆమె దోడిని పెళ్లి చేసుకోవడానికి పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది. అయితే ఈ నేపథ్యంలో ఫిల్మీబీట్ నేరుగా దోడి ఖాన్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే...

రాఖీ సావంత్ విషయానికి వస్తే.. తొలుత రితేష్ రాజ్ సింగ్‌ను వివాహం చేసుకొన్నది. వారిద్దరూ బిగ్‌బాస్ 15 లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారి తీసింది. కానీ వారిద్దరి పెళ్లి మాత్రం ఎక్కువ రోజులు కొనసాగలేదు. వారిద్దరి 2022 ఫిబ్రవరిలో విడిపోయారు.

Is Rakhi Sawant fianc e Dodi Khan not Pakistani Already married to someone

రితేష్ రాజ్ సింగ్‌తో విడాకుల తర్వాత ఆదిల్ ఖాన్ దురానీ అనే అతడిని పెళ్లి చేసుకొన్నది. తన భర్త తనను మోసం చేశాడు. ఆయనకు వివాహేతర సంబంధం ఉంది అంటూ ఆరోపణలు చేసింది. అతడిపై కేసు నమోదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఐదు నెలలు జైలులో ఉండి విడుదలయ్యారు.

దోడి ఖాన్ మీరు పాకిస్థాన్‌లో ఉన్నారు. కానీ మీ మొబైల్ నంబర్ కోడ్ నెదర్లాండ్‌కు చెందినది ఉంది. మీరు పాకిస్థానా? లేదా నెదర్లాండ్‌కు చెందిన వారా? అంటే.. నేను నెదర్లాండ్‌కు చెందిన వాడిని. నేను పాకిస్థాన్‌లో ఉద్యోగం చేస్తాను. నా జాతీయత పాకిస్థానీ కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. నా పెళ్లి ఊరేగింపు రాఖీ సావంత్ ఎక్కడ కోరుకొంటే అక్కడ నిర్వహిస్తాను అని దోడా ఖాన్ వెల్లడించారు.

అయితే రాఖీ సావంత్‌ను మోసం చేయాలనుకోవడం లేదు. నిజమైన ప్రేమనే ఉంది. అయితే నా ప్రేమలో స్వచ్ఛత లేదనే వారు పాపులారిటీ కోసం కామెంట్స్ చేస్తుంటారు. గతంలో రాఖీకి ఏం జరిగిందో నాకు తెలుసు. పెళ్లి విషయంలో పాకిస్థాన్, ఇండియా దేశాలకు చెందిన వాళ్లం జాగ్రత్తగా ఉండాల్సిందే. నేను ఏదైనా చేస్తే ప్రేమతో స్వచ్చత ఉంటుంది ఉంటుంది అని దోడా ఖాన్ తెలిపారు.

Is Rakhi Sawant fianc e Dodi Khan not Pakistani Already married to someone

నా వయసు 35 సంవత్సరాలకుపైనే ఉంటుంది. నాకు ఇంతకు ముందు పెళ్లైందా? అంటే నేను ఇప్పుడే చెప్పలేను. ఆ తర్వాత మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను. అలాంటి విషయాలు క్లారిటీతో మీకు చెబుతాను అని దోడా ఖాన్ తాజాగా ఫిలింబీట్‌కు ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అయితే తనపై ఆదిల్ ఖాన్ చేస్తున్న ప్రచారంపై దోడి ఖాన్ ఘాటుగా స్పందించారు. రాఖీని పెళ్లి చేసుకొంటున్నాననే జెలసీ ఆయనకు ఉంది. అందుకే ఆయన నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కేవలం పబ్లిసిటీ కోసం మా బంధంపై బురద జల్లుతున్నారు అని దోడి, రాఖీ సావంత్ విమర్శించారు.

More from Filmibeat

Read more about: rakhi sawant dodi khan bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X