డ్రగ్స్‌ రాకెట్‌లో మరో 15 బాలీవుడ్ ప్రముఖులు.. రియా అరెస్ట్ తర్వాత తెరపైకి రకుల్ ప్రీత్

హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత బాలీవుడ్‌తో డ్రగ్స్ మాఫియా సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పలువురు ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సినీ ప్రముఖులకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే విషయం రియాను విచారించిన సమయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల దృష్టికి వచ్చిందనేది తాజా సమాచారం. తాజాగా ముంబై మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న విషయాలు ఇవే..

సుశాంత్ ఇంటి నుంచి రియా ఇంటికి డ్రగ్స్

సుశాంత్ ఇంటి నుంచి రియా ఇంటికి డ్రగ్స్

లాక్‌డౌన్ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివాసంలో ఉన్న రియా చక్రవర్తి ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుశాంత్ ఇంటి నుంచి రియా ఇంటికి 500 గ్రాముల నిషేధిత మారిజువానాను కోరియర్ సంస్థ ద్వారా సరఫరా చేసినట్టు బయటకు వచ్చింది. కొరియర్‌ ద్వారా నిషేధిత మాదక ద్రవ్యాలను ఏప్రిల్ నెలలో శాంతాక్రజ్‌లోని రియా చక్రవర్తి ఇంటికి పంపినట్టు పనిమనిషి దీపేశ్ సావంత్ అధికారులకు వెల్లడించారు.

15 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు

15 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు

రియాను విచారించిన సమయంలో డ్రగ్ రాకెట్‌తో సంబంధమున్న బాలీవుడ్‌కు చెందిన 15 మంది సెలబ్రిటీల పేర్లను బయటపెట్టినట్టు తెలిసింది. అంతేకాకుండా 25 మంది డ్రగ్స్ దాందాను నిర్వహించే వ్యక్తుల పేర్లను కూడా అధికారులకు చెప్పినట్టు సమాచారం. అయితే ఆ సెలబ్రిటీల జాబితాను రూపొందించిన ఎన్సీబీ అధికారులు వారిని త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉందనే కథనాలు మీడియాలో వెలువడుతున్నాయి.

స్వయంగా సినీ ప్రముఖులే డ్రగ్స్ దందా

స్వయంగా సినీ ప్రముఖులే డ్రగ్స్ దందా

అయితే బాలీవుడ్‌కు చెందిన బీ గ్రేడ్ ప్రముఖులు డ్రగ్స్ రాకెట్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారు నిషేధిత మాదక ద్రవ్యాలను తీసుకొంటున్నారనే విషయంపై నార్కోటిక్స్ దృష్టి పెట్టింది. అయితే పలువురు ప్రముఖులు డ్రగ్స్ నిల్వ చేసుకోవడం, సినీ ప్రముఖులకు సరఫరా చేయడం చేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే త్వరలోనే మరికొందరు సినీ ప్రముఖులను విచారించినున్నట్టు సమాచారం.

డ్రగ్స్‌తో రియా వీడియో వైరల్

డ్రగ్స్‌తో రియా వీడియో వైరల్


ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్‌తో కలిసి రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకొంటున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. విచారణ సమయంలో తనకు డ్రగ్స్ తీసుకొనే అలవాటు లేదని, సిగరెట్లు కూడా తాగనని రియా అధికారులకు చెప్పిన నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం చర్చనీయాంశమవుతున్నది. రియాకు డ్రగ్స్‌ అలవాటు ఉందనే విషయం ఈ వీడియో ద్వారా స్పష్టమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
అనూహ్యంగా సారా, రకుల్ పేర్లు తెరపైకి

అనూహ్యంగా సారా, రకుల్ పేర్లు తెరపైకి


ఇదిలా ఉండగా, డ్రగ్స్ రాకెట్‌తో బాలీవుడ్ ప్రముఖులకు సంబంధాలున్నాయనే వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో తెరపైకి సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, మరో డిజైనర్ పేరు బయటకు రావడం సంచలనం రేపింది. విచారణలో ఏన్సీబీ అధికారులుకు రియా వెల్లడించినట్టు జాతీయ మీడియాకు చెందిన ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈ విషయాన్ని బయటపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X