ఏడాదిలో స్టార్ హీరో, హీరోయిన్ విడాకులు.. జ్యోతిష్కుడి సంచలన కామెంట్

సినిమా ఇండస్ట్రీలో జాతకాలు, మూఢ నమ్మకాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. అయితే జ్యోతిష్యులు చెప్పే వాటిని సినీ తారలు తూచ తప్పకుండా పాటిస్తారు. నిర్మాతలు, దర్శకులు జ్యోతిష్కులు, పండితులు వెల్లడించే సలహాలు, సూచనలు తప్పకుండా పాటిస్తారు. అలాంటి బలహీనతలను ఆధారంగా చేసుకొని కొందరు జ్యోతిష్యులు సంచలన విషయాలు బయటపెడుతుంటారు. అయితే బాలీవుడ్‌లో ప్రముఖ జ్యోతిష్కుడిగా పాపులారిటిని సంపాదించుకొన్న సుశీల్ కుమార్ సింగ్ ఇటీవల సంచలన విషయాలను బయటపెడుతున్నారు. సిద్దార్థ్ కన్నన్ అనే యూట్యూబర్‌కు సుశీల్ ఇచ్చిన ఇంటర్వూలో సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్ గురించి ఏం చెప్పారంటే?

అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉన్న ఇంటిలో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఇటీవల జరిగింది. ఆ దాడి బాలీవుడ్‌లో సంచలనం రేపింది. అయితే ఆ దాడి తర్వాత ఎన్నో అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ దాడి తర్వాత సైఫ్, కరీనా మధ్య ఉన్న గొడవలు, కాపురంలో కలతలు చెలరేగాయని ఊహాగానాలు బయటకు వచ్చాయి. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి, కరీనా కపూర్‌తో వివాదం గురించి ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.

Kareen Kapoor heading for Divorce

Photo Credit: https://www.instagram.com/kareenakapoorkhan/

సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్ కుండలి చూసిన తర్వాత 2010 సంవత్సరంలోనే వారి దాంపత్య జీవితం గురించి చెప్పాను. వారి కాపురం పూర్తి జీవిత కాలం కొనసాగదు.వారి సంసార జీవితం మధ్యలోనే ఆగిపోతుంది. వారిద్దరు విడాకులు తీసుకొంటారని నేను నా బ్లాగ్‌లో చెప్పాను. త్వరలోనే అది జరుగుతుంది అని ప్రముఖ జ్యోతిష్కుడు సుశీల్ కుమార్ సింగ్ తెలిపారు.

సైఫ్ ఆలీ ఖాన్‌పై జరిగిన దాడి కుటుంబ వ్యవహారాల్లో భాగంగానే జరిగింది. వారి మధ్య ఉన్న సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదు. వచ్చే ఏడాదిన్నర కాలంలో విడాకులు జరిగే అవకాశం ఉంది. వారి జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి. అందుకే వారి కాపురంలో కలతలు చోటు చేసుకొంటున్నాయి. నేను చెప్పిన జ్యోతిష్యం ఎన్నడూ తప్పు కాలేదు. జరగకుండా ఉండలేదు. నేను ఏది చెప్పినా గ్రహాల స్థితి, కుండలిలో ఉండే ప్రకారమే చెబుతాను అని సుశీల్ పేర్కొన్నారు.

Kareen Kapoor heading for Divorce

Photo Credit: https://www.instagram.com/kareenakapoorkhan/

ఇక ముందు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరగదు. ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు. గతంలో జరిగిన దాడి కేవలం బయటి ప్రపంచానికి చూపించుకోవడానికే. అయితే సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉన్న ఇంటిలోకి అంత పెద్ద చాకు ఎలా వెళ్తుంది.. ఎలా బయటకు పోతుంది. రెండురోజుల్లోనే సైఫ్ హాస్పిటల్ నుంచి బయటకు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయనపై దాడి కేసులో అనేక సందేహాలు ఉన్నాయనే విధంగా ఆయన కామెంట్ చేశారు.

అయితే కరీనా, సైఫ్ గురించి సుశీల్ చెప్పిన విషయాలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి చెత్త విషయాలు చెప్పడానికే జ్యోతిష్యం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా మంచి విషయాలు చెబితే అందరికి ఉపయోగ పడేలా ఉంటుంది. జ్యోతిష్యాన్ని బజారున పడేస్తున్నారు అంటూ నెటిజన్లు, సినీ అభిమానులు మండిపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X