సల్మాన్ పెళ్లిని అడ్డుకొన్న స్టార్ హీరోయిన్ తండ్రి.. మ్యారేజ్ మిస్ చేసుకొన్న బ్యూటీ ఎవరంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రస్తావన ఏదైనా వస్తే..ఆయన పెళ్లి గురించే ముందు మాట్లాడుతారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లలో ఒకరైన ఆయన ఇప్పటికే అవివాహితుడిగానే ఉండటం వెనుక అనేక కథనాలు బయటకు వస్తుంటాయి. అయితే ఆయన జీవితంలో జరిగిన బ్రేకప్స్ మరే హీరోకు కూడా జరుగవనేది తాజాగా వెలుగు చూసిన ఓ అంశం సాక్ష్యంగా నిలిచింది. స్టార్ హీరోయిన్‌తో ఆయన పెళ్లి చేసుకోవాలని చేసిన ప్రయత్నాలపై ఆమె తండ్రి నీళ్లు చల్లారనే విషయంపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఈ హీరోయిన్ ఎవరు? ఆమె తండ్రి పెళ్లికి ఎందుకు నిరాకరించారనే వివరాల్లోకి వెళితే..
సల్మాన్ లవ్ లైఫ్ విషయానికి వస్తే.. తాను మైనే ప్యార్ కియా సినిమాలో నటించడాని కంటే ముందు.. మోడలింగ్ చేసే సమయంలోనే అప్పటి అందాల సుందరి, హీరోయిన్ సంగీతా బిజ్లానీతో పీకల్లోతు అఫైర్‌లో ఉన్నారు. వారిద్దరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. వెడ్డింగ్ కార్డులు కూడా ప్రింట్ అయ్యాయి. పెళ్లికి కొద్ది రోజుల ముందు వారిద్దరి పెళ్లి ఆగిపోయింది.

సంగీతా బిజ్లానీతో బ్రేకప్ తర్వాత కొంత మంది యువ హీరోయిన్లతో అఫైర్ వార్తలు వినిపించాయి. కానీ ప్రధానంగా ఐశ్వర్యరాయ్‌తో అఫైర్, డేటింగ్ చాలా గాఢంగా ఉండేదనేది అందరికి తెలిసిందే. సల్లూ, ఐష్ బంధం కూడా దాదాపు పెళ్లి వరకు వచ్చింది. కానీ సల్మాన్ తాగి ఆమెను విచక్షణారహితంగా కొట్టేవారని, వేధించడం వల్ల ఐష్ ఆయనకు దూరమైందనే కథనాలు బాలీవుడ్‌లో వినిపించాయి.
ఇక ఐశ్వర్యరాయ్ తర్వాత సోమీ ఆలీ, కత్రినా కైఫ్‌తో డేటింగ్ ఎక్కువ రోజులే సాగింది. సోమీ ఆలీతో వ్యవహారం ముగిసిన తర్వాత కత్రినా కైఫ్‌కు సల్మాన్ చేరువయ్యాడు. వారిద్దరి మధ్య గాఢమైన బంధమే కొనసాగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా కత్రినాతో కూడా బ్రేకప్ జరగడంతో సల్మాన్ ఒంటరి వాడిగానే ఉండిపోయాడు.
ఇలా అందరి తారలతో బ్రేకప్ పక్కన పెడితే.. సల్మాన్‌తో జూహీ చావ్లా కూడా అఫైర్ కొనసాగించిందనే విషయం ఆసక్తికరంగా మారింది. సల్మాన్ ఖాన్ మ్యారేజ్ ప్రపోజల్స్‌ను జుహీ కూడా ఓకే చెప్పింది. కానీ వారిద్దరి పెళ్లికి జుహీ తండ్రి మోకాలడ్డారు. అయితే వారిద్దరికి ఎందుకు పెళ్లి చేయడానికి నిరాకరించారనే విషయం వెనుక కారణాలు మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇలా సల్మాన్ ఖాన్ పెళ్లి కాకుండా రకరకాల కారణాలు అడ్డంకిగా నిలిచాయి.
సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరోను ఫ్లాపులు వెంటాడుతున్నాయి. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన సికందర్ చిత్రం మార్చి 30వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రంజాన్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











