తల్లిని వదిలేసి దూరంగా హీరోయిన్.. మూట, ముళ్లే సర్ధుకొన్న బ్యూటీ.. కారణం ఏమిటంటే!

తెలుగు చిత్రం టెంపర్ రీమేక్ సింబా తర్వాత సారా అలీ ఖాన్ క్రేజ్ పెరిగిపోయింది. కేదార్‌నాథ్, సింబా హిట్లతో బాలీవుడ్‌ నిర్మాతలను తనవైపుకు తిప్పేసుకొన్నది. సక్సెస్ అనంతరం అవకాశాలు పెరగడంతో ఒంటరిగా, స్వతంత్రంగా జీవించేందుకు నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. ప్రస్తుతం తల్లి వద్ద నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టినట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

తల్లి అమృతాసింగ్ మార్గదర్శకత్వంలో

తల్లి అమృతాసింగ్ మార్గదర్శకత్వంలో

సినీ రంగంలోకి రాకముందు సైఫ్ ఆలీ ఖాన్, అమృతసింగ్ ముద్దుల కూతురైన ఈ అందాల భామ తన తల్లివద్దే ఉండేది. సింబా సినిమా షూటింగ్ ముగిసేంతవరకు తల్లి మార్గదర్శకత్వంలోనే నడించింది. హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్‌లో సారా అలీ ఖాన్ వెంట అమృతా సింగ్ కనిపించిన సంగతి తెలిసిందే.

తల్లి ఇంటి నుంచి బయటకు

తల్లి ఇంటి నుంచి బయటకు

తాజాగా తన తల్లి అమృత సింగ్ ఇంటి నుంచి తన వస్తువులను ప్యాక్ చేసుకొని వేరే ప్రాంతానికి షిప్టు చేయడం మీడియా కంటపడింది. ఇంటికి కావాల్సిన గృహ ఉపకరణాలు, అలంకరణ వస్తువులు అట్టెపెట్టెల్లో పెట్టుకొని వెళ్లడం స్పష్టంగా కనిపించింది.

 సొంత ఇంటిలోకి షిఫ్ట్

సొంత ఇంటిలోకి షిఫ్ట్

అంతేకాకుండా తన వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడే దుస్తులు, ఇంట్లో పెట్టే ఫ్లవర్ వాజ్‌లు తన కారు వెనుక భాగంలో లోడ్ చేస్తూ కనిపించారు. తనకు తాను స్వతంత్ర్యంగా ఉండేదుకు ముంబైలో ప్రత్యేకంగా ఓ అపార్ట్‌మెంట్‌కు షిప్ట్ అయినట్టు తెలుస్తున్నది.

రెండు సక్సెస్‌ల తర్వాత సారా

రెండు సక్సెస్‌ల తర్వాత సారా

కేదారినాథ్, సింబా తర్వాత దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందించే చిత్రంలో కార్తీక్ ఆర్యన్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా కరణ్ జోహర్ రూపొందించే ఓ బయోపిక్ చిత్రంలో కూడా నటించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహిస్తారని బాలీవుడ్ పత్రిక కథనాన్ని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X