800 కోెట్ల బడ్జెట్‌తో బాలీవుడ్ సూపర్‌స్టార్‌తో సుకుమార్ మూవీ.. ఆ స్టార్ హీరో ఎవరంటే?
ఇండియన్ సినిమా ప్రస్తుతం దక్షిణాదిపై దృష్టి సారించింది. సౌత్ దర్శకులు భారీ విజయాలు సాధిస్తుండటంతో ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు తెలుగు, తమిళ, కన్నడ రంగాలపై కన్నేశారు. ఇప్పటికే దక్షిణాది దర్శకులతో పనిచేసిన వారు మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకొంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షాగా పేరున్న సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఈ సారి తమిళంపై కాకుండా తెలుగు రంగంపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు జరిగిన సంప్రదింపుల తర్వాత షారుక్ ఓ తెలుగు దర్శకుడితో పనిచేయబోతున్నారనేది తాజా సమాచారం. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
జవాన్, పఠాన్ సినిమాలకు ముందు షారుక్ ఖాన్‌కు గడ్డు పరిస్థితి ఎదురైంది. ఆయన నటించిన సినిమాలన్నీ క్యూ కట్టాయి. వరుస ఫ్లాపుల నుంచి ఆయన కోలుకోలేకపోయారు. దాంతో సుమారుగా కరోనా రెండేళ్లకుపైగా కాలంతో సుమారుగా నాలుగు సంవత్సరాలు ముఖానికి రంగు వేసుకోకుండా మంచి కథలు, దర్శకుల కోసం కాలక్షేపం చేశారు.

అయితే సౌత్‌లో టాప్ డైరెక్టర్ అట్లీతో కలిసి చేసిన జవాన్ ప్రాజెక్ట్ షారుక్‌ను మళ్లీ ట్రాక్ మీదకు తీసుకొచ్చింది. షారుక్‌కు సాధారణ హిట్ కాకుండా దిమ్మతిరిగిపోయేలా 1000 కోట్లకుపైగా కలెక్షన్లతో బ్లాక్ బస్టర్‌ను అందించాడు. దాంతో ఆయన మళ్లీ స్టార్ డమ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే జవాన్, పఠాన్ సక్సెస్ తర్వాత మళ్లీ బాద్షా రెండేళ్లుగా మంచి సినిమాను అందించేందుకు వెయింటింగ్‌లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ తదుపరి సినిమాపై జోరుగా ప్రచారం జరుగుతున్నది. పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు సుకుమార్‌తో ప్రాజెక్టు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే షారుక్ ఖాన్ ఇటీవల పలు వేదికలపై పుష్ప సినిమాకు సంబంధించిన తగ్గేదేలే అనే డైలాగ్‌ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అయితే షారుక్, సుకుమార్ మధ్య కథాపరమైన చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇంకా సబ్టెక్ట్‌పై ఫైనలైజ్ కాలేదు. వారి మధ్య టాక్స్ ప్రైమరీ దశలోనే ఉన్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాలు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నారు. కానీ జాతీయ మీడియాలో సుక్కు, షారుక్ ప్రాజెక్టు గురించిన సమాచారం వైరల్ అవుతున్నది. అయితే ఈ విషయంపై రెండు వర్గాల్లో ఎవరైనా ఒకరు స్పందిస్తే తప్పా.. ఈ వార్తపై క్లారిటీ రాకమానదు.
ఇదిలా ఉండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి శంకర్, నవీన్ నిర్మించిన పుష్ప 2 చిత్రం రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1875 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియన్ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి తర్వాత ఆ స్థానంలో పుష్ప 2 నిలిచింది.
అయితే పుష్ప 2 తర్వాత రామ్ చరణ్‌తో మూవీకి సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత షారుక్ ఖాన్‌తో సినిమా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే ఈ ప్రాజెక్ట్ ఒకే అయితే హిందీలో మరో భారీ బడ్జెట్ చిత్రంగా మారుతుందని, ఈ సినిమా నిర్మాణ వ్యయం సుమారుగా 800 కోట్ల మేర ఉంటుందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











