500 కోట్ల భారీ బడ్జెట్.. తెలుగు డైరెక్టర్, నిర్మాతలతో షారుక్ ఖాన్ సినిమా!
భారతీయ సినిమా రంగంలో సత్తా చాటుతున్న దక్షిణాది సినీ పరిశ్రమపై బాలీవుడ్ సినీ తారలు దృష్టిపెడుతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లతో జతకట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ దక్షిణాది దర్శకులతో సినిమాలు తీసి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే గతంలో అట్లీతో జవాన్ సినిమాతో హిట్ కొట్టిన షారుక్ ఖాన్ తాజాగా తెలుగు దర్శకుడు, పాపులర్ తెలుగు సినీ నిర్మాణ సంస్థతో చేతులు కలిపేందుకు సిద్దమయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
గతంలో వరుస ఫ్లాప్‌లతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన షారుక్ ఖాన్ .. తన గ్రాఫ్ పెంచుకొనేందుకు తమిళ టాప్ దర్శకుడు అట్లీ కుమార్‌తో జతకట్టి జవాన్ సినిమాలో నటించాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. షారుక్ ఖాన్‌కు కెరీర్‌కు మరోసారి పునర్జన్మను ఈ సినిమా ప్రసాదించింది. దాంతో బాలీవుడ్ బాద్షా మళ్లీ పునర్వైభవాన్ని సొంతం చేసుకొన్నాడు.

ఆ తర్వాత తమిళ దర్శకుడు మురగదాస్‌తో సల్మాన్ ఖాన్ తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. వారిద్దరి కాంబినేషన్‌లో రష్మిక మందన్నతో కలిసి సికందర్ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా సల్లూభాయ్ అదృష్టరేఖను మార్చలేకపోయింది. సికందర్ సినిమా దారుణంగా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. అయితే ఈ ఫ్లాప్ బాలీవుడ్ తారలు దృష్టిని మరల్చలేకపోయింది.
ప్రస్తుతం షారుక్ ఖాన్ క్రేజీ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సౌత్ టచ్ ఉన్న పాన్ ఇండియా మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు పుష్ప 2 మూవీతో దేశ సినీ రంగంలో సంచలనం రేపిన కాంబో మరోసారి రిపీట్ కానున్నది. షారుక్ ఖాన్‌తో ఫైనల్‌గా చర్చలు ముగిసాయి. షారుక్ తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాతతో సినిమా చేసేందుకు అంగీకరించాడు అనే వార్త ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం అవుతున్నది.
అయితే షారుక్ ఖాన్ చేయబోయే సినిమా ఎవరితో అంటే.. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాను నిర్మించేది నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందనున్నది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నది అని తెలిసింది.
అయితే షారుక్ ఖాన్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించే పనిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సుమారుగా 500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్టు వార్తలు అందాయి. ఈ ప్రాజెక్టు గురించి మైత్రీ మూవీస్ త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నది. ఈ మూవీ షారుక్ నటిస్తున్న కింగ్ సినిమా తర్వాత సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఆప్‌డేట్స్, ఎక్స్‌క్లూజివ్ స్టోరీల గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











