హిందీ అర్జున్‌రెడ్డికి క్యాన్సర్.. షాహీద్ కపూర్ ఫ్యామిలీ స్పందన!
బాలీవుడ్ సినీ ప్రముఖులను క్యాన్సర్ వ్యాధి పట్టి పీడిస్తున్నది. ఇటీవల కాలంలో ఇర్ఫాన్ ఖాన్, సొనాలి బింద్రే, నఫీసా అలీ లాంటి ప్రముఖులు క్యాన్సర్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ క్యాన్సర్‌కు గురయ్యారనే వార్త మీడియాలో సంచలనం రేపింది. పలువురు నటులను, అభిమానులను షాక్ గురిచేసింది. ఇంతకు షాహిద్ గురించి వచ్చిన వార్తలు ఏమిటంటే..

హిందీ అర్జున్ రెడ్డి రీమేక్‌లో
వరుస విజయాలతో షాహిద్ కపూర్ దూసుకెళ్తున్నాడు. తాజాగా తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో షాహీద్ కపూర్ ఉదర సంబంధిత క్యాన్సర్ వ్యాధికి లోనైనట్టు వార్తలు వచ్చాయి.

ఉదర క్యాన్సర్‌తో
షాహీద్ కపూర్ ఉదరంలో క్యాన్సర్ ఉన్నట్టు వైద్యుల పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతున్నదని కథనాల్లో పేర్కొన్నారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. మీడియాలో వస్తున్న రిపోర్టులన్నీ రూమర్లే అని కుటుంబ వర్గాలు స్పష్టం చేశాయి.

మీడియా కథనాలపై ఫైర్
షాహీద్ ఆరోగ్యం గురించి మీడియా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రాసేస్తుందా? వార్తలో ఎంత నిజముంది అనే విషయం తెలుసుకోరా? ఇలా రాస్తే వారి కుటుంబం ఏమై పోవాలి? వారి మానసిక పరిస్థితిని పట్టించుకోరా అని కుటుంబ సభ్యులు నిలదీశారు.

క్యాన్సర్ వార్తలో వాస్తవం లేదు
షాహీద్ కపూర్ అనారోగ్యం వార్తలపై మేనేజర్ ఆకాంక్ష మీడియాతో మాట్లాడారు. షాహీద్ కపూర్‌కు క్యాన్సర్ అనే వార్తలో ఎలాంటి నిజం లేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ తప్పుడు కథనాలే. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు వాస్తవాన్ని అడిగి తెలుసుకోవాలి అని ఆమె స్పస్టం చేశారు.


Click it and Unblock the Notifications











