మళ్లీ ప్రేమలో పడ్డ శ్రద్ధాకపూర్.. రొమాంటిక్‌గా ప్రియుడిని గుర్తు చేసుకొంటూ
బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ సాహో చిత్ర షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నది. ఈ చిత్రంతో దక్షిణాదిలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నది. అయితే శ్రద్ధాకపూర్ లవ్‌లో పడిందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. శ్రద్ధా డేటింగ్ వ్యవహారాలు మీడియాకు కొత్తేమీ కాదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టింగ్ మరింత ఆసక్తిని రేపింది. అంతేకాకుండా ఆమె అఫైర్‌లో ఉందా అనే వార్తకు మరింత బలం చేకూర్చింది. వివరాల్లోకి వెళితే..

పాపులర్ ఫొటోగ్రాఫర్‌తో డేటింగ్
బాలీవుడ్‌లో ప్రముఖ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో రొమాన్స్ చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో రోహన్ పేరుతో ఆమె చేసిన పోస్టు వారిద్దరి సాన్నిహిత్యాన్ని బలంగా చెప్పింది. దాంతో వారిద్దరి అఫైర్‌పై భారీగా రూమర్లు చెలరేగుతున్నాయి.
Recommended Video


ఇన్స్‌టాగ్రామ్‌లో ఫొటో పెట్టి
రోహన్ క్లిక్ చేసిన తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టింది. ఆ ఫొటోను చూస్తుంటే రోహన్‌తో గడిపిన తాజా విషయాలు గుర్తొస్తున్నాయి అని కామెంట్ పెట్టింది. దాంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం రేకెత్తింది.

బాల్య స్నేహితుడితో లవ్
వాస్తవానికి రోహన్, శ్రద్ధాకపూర్ ఇద్దరు బాల్య స్నేహితులు. వారి స్నేహం ఇటీవల ప్రేమగా మారిందని వారి సన్నిహితులు చెప్పుకొంటున్నారు. అయితే వారి నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఈ వార్త రూమర్లకే పరిమితమైంది.

గతంలో హీరోలతో అఫైర్ వార్తలు
గతంలో ఆదిత్య రాయ్ కపూర్, సిద్ధార్థ్ కపూర్, ఫర్హాన్ అఖ్తర్‌తో ప్రేమలో పడిందనే వార్తలు వచ్చాయి. ఫర్హాన్‌తో డేటింగ్ వ్యవహారం తండ్రి శక్తికపూర్, శ్రద్ద కపూర్ల మధ్య చిచ్చుపెట్టింది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారనే వార్తలు వెలుగుచూశాయి.

సాహో, సైనాతో బిజీ బిజీగా
ప్రస్తుతం సాహో చిత్రంతోపాటు, షటిల్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటిస్తున్నది. ఇటీవల ఆమె నటించిన స్త్రీ చిత్రం బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకొన్నది. తన కెరీర్ రాకెట్ దూసుకుపోయే అవకాశం ఉందని సాహో చిత్రంపై గంపెడాశలు శ్రద్ధాకపూర్ పెట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











