Sreeleela: బాలీ స్టార్ హీరో కొడుకుతో మీడియా కంట పడ్డ శ్రీలీల..ఇంతకీ మ్యాటరేంటీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీ లీలా ఒక్కరు. ఇటీవల అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 సినిమాలో 'కిస్సిక్' సాంగ్ పై మాస్ స్టెప్పులు వేసి నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ స్పెషల్ సాంగ్ తో ఈ అమ్మడు కెరీర్ మొత్తం టర్న్ అయిపోయింది. తాజాగా ఈ అమ్మడు కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ అమ్మడు ఓ బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో మీడియా కంట పడింది. ఇంతకీ మేటర్ ఏంటంటే?

కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులో అడుగుపెట్టింది శ్రీ లీల. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన 'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇలా మొదటి సినిమాలోనే తన నటనతో మంచి మార్కులను సంపాదించుకుంది. దీంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో 'ధమాకా' సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమాలో గాజువాక కండక్టర్ సాంగ్ లో మాస్టెప్పులేసి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది శ్రీ లీల. ఈ సినిమాతో శ్రీలీల మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.

Is Sreeleela planning to make her Bollywood debut alongside Saif Ali Khan s son Ibrahim

అనంతరం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'భగవంత్ కేసరి' సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈ అమ్మడు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాలో నటించి స్పెషల్ స్టార్ డం సొంతం చేసుకోండి. ఇలా టాలీవుడ్ హీరోలు ఈ అమ్మాయితో సినిమాలలో నటించాలని పోటీపడేలా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇలా అతి తక్కువ కాలంలో మహేష్ బాబు, బాలకృష్ణ,రవి తేజ, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకోండి.

అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', హీరో నితిన్ తో రాబిన్ హుడ్, శివకార్తీక సినిమాలలో కూడా నటించబోతున్నట్లు టాక్.‌
ఈ అమ్మడు ప్రస్తుతం శ్రీ లీలలకు సంబంధించిన సోషల్ మీడియాలో గుప్పుమంటుంది. ఇప్పటివరకు టాలీవుడ్ లో దుమ్మురేపిన ఈ అమ్మడు బాలీవుడ్ లో సందడి చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల పుష్ప 2 క్రేజ్ తో ఈ అమ్మడుకు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయట. ఈ తరుణంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో శ్రీ లీల ఓ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీ నచ్చడంతో శ్రీ లీల కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Is Sreeleela planning to make her Bollywood debut alongside Saif Ali Khan s son Ibrahim

ఇబ్రహీం అలీ ఖాన్ , శ్రీలీలల సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు బాలీవుడ్ టాక్. అలాగే ఈ సినిమా తర్వాత ఇబ్రహీం కొత్తగా కథను కూడా లైన్ లో పెట్టినట్టు స్త్రీ 2 తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న మ్యాడాక్స్ ఫిలిమ్స్ లో ఓ హర్రర్ మూవీ లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే శ్రీ లీల ఇబ్రహీం జంట మీడియా కంట పడినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఇబ్రహీం చేతిలో స్క్రిప్ట్ బుక్ పట్టుకొని కనిపించాడు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ తరుణంలో బాలీవుడ్ లో కొత్తజంట అడుగు పెట్టబోతున్నట్లు ప్రచారం సౌత్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన శ్రీ లీల మరి బాలీవుడ్లో ఎలా పర్ఫామెన్స్ ఇవ్వగలదో? అక్కడి ప్రేక్షకులను ఎలా మైమరిపించగలదో? వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X