అక్షయ్ కుమార్ అత్తగారితో ఆ హీరో అఫైర్?.. మిస్టరీగానే రిలేషన్!

సినీ పరిశ్రమలో నాటి నుంచి నేటి వరకు ఎందరో తారల మధ్య అఫైర్స్ నడిచాయి, బ్రేకప్స్ అయ్యాయి, కొందరు పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా తమ జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే నాలుగు గోడల మధ్య ఆగిపోయినవి, మధ్యలోనే సమాధి అయిపోయినవి ఎన్నో ఉన్నాయి. సదరు నటీనటులకు క్లోజ్‌గా ఉన్నవాళ్లో, లేదంటే మరొకరో ఏళ్ల తర్వాత ఈ విషయాలను బయటపెట్టి బాంబు పేల్చుతుంటారు. అలాంటిదే ఈ కథ కూడా.

బేతాబ్‌తో ఎంట్రీ ఇచ్చిన సన్నీ డియోల్

బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర పెద్ద కుమారుడు సన్నీడియోల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1983లో రాహుల్ రావైల్ దర్శకత్వంలో తన తండ్రి నటించిన బేతాబ్ చిత్రంలో తొలిసారిగా నటించారు సన్నీ. ఈ సినిమా హిట్ కావడంతో ఇండస్ట్రీలో మరో స్టార్ హీరో వారసుడు నిలదొక్కుకునేందుకు బీజాలు పడ్డాయి. ఆ తర్వాత సోహ్ని మహివాల్, అర్జున్, పాప్‌కి దునియా, త్రిదేవ్, చల్‌భాజ్‌లు హిట్ కావడంతో సన్నీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో ధర్మేంద్ర నిర్మాతగా తెరకెక్కిన ఘయాల్ చిత్రంతో తొలిసారిగా హీరోగా నటించారు సన్నీడియోల్.

is Sunny Deol and Dimple Kapadia has love story Here s a closer look at their alleged relationship

ఖాన్‌లకు పోటీ ఇచ్చిన సన్నీ

90వ దశకంలో ఖాన్‌ త్రయం, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ నుంచి గట్టి పోటీ ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు సన్నీ డియోల్. అయితే నెమ్మదిగా ఆయన ప్రభ మసకబారుతూ వచ్చింది. మధ్యలో రాజకీయాల వైపు వెళ్లిన ఆయన గదర్ 2తో ఇండస్ట్రీని షేక్ చేశారు. ఈ ఏడాది జాట్‌తో మరోసారి తన సత్తా చాటారు. 70 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయన కెరీర్‌లో పలు వివాదాలతో పాటు ప్రేమకథలు కూడా చాలానే ఉన్నాయి.

is Sunny Deol and Dimple Kapadia has love story Here s a closer look at their alleged relationship

అమృతా సింగ్‌తో ఫస్ట్ లవ్

తన తొలి చిత్రం బేతాబ్ సమయంలోనే అప్పటి స్టార్ హీరోయిన్ అమృతా సింగ్‌తో ప్రేమలో పడటంతో ఇండస్ట్రీ చెవులు కొరుక్కుంది. అయితే సన్నీకి అప్పటికే పూజతో పెళ్లి అయ్యిందన్న నిజం తెలిసి అమృత మనసు విరిగిపోయి ఆయనకు దూరమైంది. కుటుంబ సభ్యులతో పాటు భార్య పూజ ఒత్తిడితో సన్నీడియోల్ కూడా క్రమంగా ఆమెను మరిచిపోయాడు. ఈ దశలోనే సన్నీడియోల్ జీవితంలోకి మరో స్త్రీ ప్రవేశించింది. ఆవిడ ఎవరో కాదు.. బాలీవుడ్ సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా మాజీ భార్య డింపుల్ కపాడియా. అప్పటికి రాజేశ్‌తో విడిపోవడంతో పాటు తన చెల్లెళ్లు, తమ్ముడు మరణించడంతో పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు డింపుల్. 1984లో మంజిల్ మంజిల్ సినిమా సెట్‌లో ఆమెను తొలిసారిగా కలిశారు సన్నీడియోల్.

Take a Poll

డింపుల్‌కి అండగా నిలిచిన సన్నీ

డింపుల్ జీవితంలో చోటు చేసుకున్న విషాదాల గురించి తెలిసి అండగా నిలిచాడు. క్రమంగా వీరి స్నేహం, ప్రేమగా మారింది. చివరికి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అప్పట్లో ముంబైలోని బస్‌స్టాప్, బీచ్ ఏరియాలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీరి ఫోటో వైరల్ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఈ విషయం తెలుసుకున్న పూజ భర్తపై రగిలిపోయారట. డింపుల్‌తో రిలేషన్ కట్ చేసుకోకుంటే పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతానని బెదిరించడంతో సన్నీ సైలెంట్ అయ్యాడని చెబుతుంటారు. కానీ డింపుల్‌ - సన్నీడియోల్ మధ్య బ్రేకప్ జరగలేదని వీరిద్దరి మధ్య రిలేషన్ నేటికీ కొనసాగుతూనే ఉందని బాలీవుడ్ జనాలు కథలు కథలుగా చెబుతుంటారు. అన్నట్లు డింపుల్ కపాడియే కూతురే హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X