ప్రియుడితో సుస్మితా సేన్ బ్రేకప్.. గందరగోళంలో పడేసిన మాజీ మిస్ యూనివర్స్ ట్వీట్
మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్ డేటింగ్ వ్యవహారం బాలీవుడ్ మీడియాలో గత కొద్ది నెలలుగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రియుడితో కలిసి చేసే విన్యాసాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కూడా చర్చనీయాంశమైంది. అయితే వారి బంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్న అభిమానులకు సుస్మితా సేన్ షాకిచ్చింది. నర్మగర్బంగా సోషల్ మీడియా పోస్టుతో బ్రేకప్ అయిందా అనే అనుమానాన్ని రేకెత్తించింది. సుస్మితా సేన్ బ్రేకప్ గురించి వివరాల్లోకి వెళితే...

రోహ్మన్‌తో సుస్మిత సేన్ సహజీవనం
బాలీవుడ్‌లో సెలబ్రిటీ రోహ్మన్ షాతో సుస్మిత సేన్ కొద్ది నెలలుగా సహజీవనం చేస్తున్నారు. వారిద్దరి కలిసి చేసే విన్యాసాలు ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఫిట్‌నెస్, యోగా లాంటి వ్యవహారాలతో సుస్మిత, రోహ్మన్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.

ప్రతికూల పరిస్థితుల్లో గొప్ప నిర్ణయాలు
ఇటీవల సుస్మితా సేన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెడుతూ.. నేను ఎప్పుడూ సముద్రం వద్దకు వెళ్లినా నాకు భూమి, సముద్రపు నీళ్లను చూస్తే గొప్ప భావన కలుగుతుంది. అప్పుడు నేను న్యూట్రల్‌గా ఉంటాను. నాకు ప్రతికూల పరిస్థితులు ఎదురైన సమయంలో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొన్నాను. అవన్నీ నాకు జీవిత పాఠాలు అంటూ హ్యాష్‌ట్యాగ్స్ షేర్ చేసింది.

బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్
ఫ్రిబవరి 10వ తేదీన సుస్మిత సేన్ ఓ నర్బగర్భంగా ఓ మెసేజ్‌ను పోస్టు చేశారు. పరుషుల ప్రవర్తన, వారిపై ద్వేషభావంతో కూడిన పోస్టు అభిమానులు కనుబొమ్మలు ముడిపడేలా చేశాయి. దాంతో తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ జరిగిందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

పురుషులు మారుతామని అనుకొంటాం
సుస్మితా సేన్ చేసిన పోస్టు విషయానికి వస్తే... అతడు మారుతాడని మహిళలు అనుకోవడమే అసలు సమస్య. కానీ వారు మారురుగా. ఎన్ని తప్పులు చేసిన మహిళలను మనల్ని వదిలి వెళ్లరనే ధీమా పురుషుల్లో ఉంటుంది అనే ఓ కొటేషన్ ద్వారా పేర్కొన్నది.

సుస్మితా సేన్ కెరీర్ గురించి
సుస్మితా సేన్ కెరీర్ విషయానికి వస్తే.. 2015 నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నిర్భక్ అనే మూవీ ఆమె చివరి సినిమా. అయితే గత ఏడాది మాత్రం ఆర్య అనే వెబ్ సిరీస్‌లో పవర్ ఫుల్ పాత్రలో నటించారు. డిస్నీ హాట్ స్టార్‌లో రిలీజైన ఈ వెబ్ సిరీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











