ఓ వైపు లలిత్ మోడీ.. మరో వైపు రోహన్‌తో లవ్ గేమ్.. మాజీ ప్రియుడితో పట్టు బడ్డ సుస్మితా సేన్
మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇప్పటికే పలు రకాల అఫైర్లతో మీడియాను ఆకట్టుకొన్న ఈ అందాల సుందరి తాజాగా మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీతో అఫైర్ విషయం సంచలనంగా మారింది. అంతకుముందు రోహన్ షాతో ఆమె సహజీవనం కూడా మీడియాలో చర్చకు దారి తీసింది. అయితే సుస్మిత సేన్ అఫైర్ల వ్యవహారం మరోసారి చర్చకు దారి తీసింది. ఆ వివరాల్లోకి వెళితే...

సుస్మితా సేన్‌కు పలువురితో అఫైర్లు
సుస్మితా సేన్ రిలేషన్‌షిప్, డేటింగ్, లవ్ అఫైర్ల వ్యవహారంలోకి వెళితే. డజనకుపైగా బ్రేకప్స్ గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే పలువురు ప్రముఖులతో అఫైర్లు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయాయి. అయితే దాదాపు 40 ఏళ్ల వయసులో కూడా సుస్మితా సేన్ ఒంటరి జీవితంతో సంతృప్తి పడుతున్నది.

ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకొని
లవ్, బ్రేకప్స్ విషయాలు పక్కన పెడితే.. సుస్మితా సేన్ ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకొన్నది. గత 20 ఏళ్లుగా ఆమె ఇద్దరు కూతుళ్ల సంరక్షణను చూసుకొంటున్నది. రీనీ, అలీషాతో కలిసి జీవనం కొనసాగుతున్నది. రకరకాల రూమర్ల మధ్య సుస్మితా సేన్ తన కూతురు ఆలీషా పుట్టిన రోజును గ్రాండ్‌గా జరుపుకొన్నది. ఈ సందర్భంగా ఆ వేడుకలో తన మాజీ ప్రియుడు రోహన్ షాతో కలిసి అన్యోన్యంగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

లలిత్ మోడీతో డేటింగ్ వ్యవహారం
అయితే కొద్ది రోజలు క్రితం ఊహించని విధంగా ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీతో సుస్మితా సేన్ డేటింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుస్మితాసేన్‌తో కలిసి లలిత్ మోడీ పలు ప్రాంతాల్లో విహారయాత్రకు వెళ్లిన విషయం సోషల్ మీడియాలో స్వయంగా వారు వెల్లడించడం మీడియాలో వైరల్ అయింది. సుస్మితా సేన్ అఫైర్ విషయంపై చర్చ జరుగుతుండగానే రోహన్ షాతో కలిసి కనిపించడం మీడియాలో వైరల్ అయింది.

లలిత్ మోడీతో పెళ్లి వార్తలు
గతంలో తాము విడిపోయామంటూ సుస్మితా సేన్, రోహన్ షా ఇద్దరు తమ సన్నిహితులతో చెప్పుకోవడం మీడియాలో వచ్చింది. ఆ తర్వాత తెరపైకి లలిత్ మోడీ అఫైర్, ఆ పెళ్లి వార్తలు మీడియాలో భగ్గుమన్నాయి. ఈ క్రమంలో వారి బంధం గురించి రాజకీయంగా, సినీ వర్గాల పరంగా చర్చ జరుగుతుంటే.. ఇంకా తన మాజీ ప్రియుడు రోహన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సుస్మితా సేన్ కెరీర్ ఇలా..
సుస్మితా సేన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. దాదాపు ఏడేళ్లుగా బాలీవుడ్ చిత్రాలకు దూరంగా ఉంటున్నది. అయితే టెలివిజన్, వెబ్ సిరీస్‌లతో సుస్మితా బిజీగా మారిపోయింది. ఇటీవల ఆర్య, ఆర్య 2 అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. ఆర్య సిరీస్ ఓటీటీలో బిగ్ హిట్ కావడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











