Tabu: టబు ఎంగేజ్‌మెంట్ బ్రేకప్.. అతడితో పెళ్లి ఎందుకు బెడిసి కొట్టిందంటే?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతిభావంతురాలైన యాకర్టలో టబు ఒకరంటే ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అలాంటి నటి కేవలం హిందీకే పరిమితం కాకుండా తెలుగు, తమిళంలో కూడా విశేషంగా అభిమానులను సొంతం చేసుకొన్నది. అయితే ఆమె పోషించిన పాత్రలు అభిమానులకు ఎన్నటికీ గుర్తుండిపోయేలా ఉంటాయనేది సత్యం. అయితే దాదాపు 50 ఏళ్లకు పైబడినా గానీ ఆమె పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. దానికి కారణాలు చాలా వినిపిస్తుంటాయి. కానీ ఆమె వివాహం చేసుకోకుండా ఉండిపోవడానికి ఓ నిర్మాత కారణమనే విషయం మీడియాలో వైరల్ అవుతుంటుంది. అయితే ఇటీవల తన జన్మదినం సందర్భంగా పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

టుబు కెరీర్ విషయానికి వస్తే.. వెంకటేష్ నటించిన కూలీ నంబర్ 1 సినిమాతో తెలుగులోకి ప్రవేశించింది. ఆ తర్వాత సిసింద్రీ, నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, షాక్, ఇది సంగీత, పాండురంగడు, అల వైకుంఠపురంలో లాంటి సినిమాల్లో నటించారు. అలాగే తమిళ, తెలుగు సినిమా రంగాల్లో తీసిన ప్రేమదేశం లాంటి చిత్రంలో కూడా నటించి అభిమానులను మనసు దోచుకొన్నది.

Is Tabu engagement breakup with Sajid Nadiadwala Here is the complete Details

అయితే హిందీలో నటించే సమయంలో ఆమెకు పలువురు హీరోలతో అఫైర్ ఉన్నట్టు వచ్చాయి. అయితే ముఖ్యంగా అజయ్ దేవగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు చాలా కాలంగా మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అజయ్ దేవగన్‌తోపాటు ఆమె కూడా తమ బంధంపై క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న స్నేహానికి మించి రిలేషన్ ఉందని చెప్పారు.

అయితే తెలుగులో నటించే సమయంలో అక్కినేని నాగార్జునతో అఫైర్ ఉందనే వార్త కూడా చక్కర్లు కొట్టింది. వారిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించడంతోపాటు వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు చూసి అందరూ అలానే అనుకొన్నారు. కానీ తనతో ఉన్న అనుబంధంపై నాగార్జున ఓ ఇంటర్వ్యూలో స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మేము పెళ్లి వరకు వెళ్లామనే వార్తల్లో నిజం లేదని చెప్పారు.

Is Tabu engagement breakup with Sajid Nadiadwala Here is the complete Details

అయితే ఈ ఇద్దరి విషయాన్ని పక్కన పెడితే.. బాలీవుడ్‌లో అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలాతో పీకల్లోతు రిలేషన్‌షిప్‌లో టబు ఉంది. అయితే వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే పెళ్లికి ముందు చివరి నిమిషంలో వారి ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయింది. అప్పటి నుంచి పెళ్లివైపు తిరిగి చూడలేదు. ఒంటరిగానే ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నది.

తాను పెళ్లి చేసుకోకపోవడంపై టబు స్పందిస్తూ.. జీవితంలో సంతోషానికి చాలా మార్గాలు ఉన్నాయి. రిలేషన్‌షిప్ ఒక్కటే మార్గం కాదు. ఒంటరితనాన్ని కొనసాగించడం కష్టమేమీ కాదు. మన జీవితంలోకి భాగస్వామి పేరుతో తప్పుడు వ్యక్తి వస్తే అతకంటే నరకం మరోటి ఉండదు. దానికంటే ఒంటరితనమే చాలా బెటర్ అని టబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X