తీన్మార్ హీరోయిన్ హాట్ డేటింగ్.. ఏకంగా యామీ గౌతమ్‌ మాజీ లవర్‌తో!

తెలుగు సినిమా పరిశ్రమలో బోణి చిత్రంతో ప్రవేశించిన అందాల భామ కృతి ఖర్బందా ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన తీన్మార్ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. దాంతో టాప్ రేంజ్‌కు వెళ్తుందని అందరూ ఆశించారు. అయితే ఆ తర్వాత కెరీర్ ఊపందుకోలేక చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మెప్పించలేక బాలీవుడ్‌కు తిరుగుముఖం పట్టింది. తాజాగా కృతి డేటింగ్ విషయంపై బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె డేటింగ్ చేస్తున్నదెవరితోనంటే..

యామీ గౌతమ్‌ మాజీ లవర్‌తో

యామీ గౌతమ్‌ మాజీ లవర్‌తో

బాలీవుడ్ నటుడు పుల్కిత్ సమ్రాట్‌తో యామీ గౌతమ్ అఫైర్ విషయం ముంబై మీడియాలో బాగానే నానింది. యామి, పుల్కిత్ అఫైర్‌లో మరింత జోష్ పెరిగే సరికి వారిద్దరి ఒక్కటి అవుతారా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే అనూహ్యంగా వారిద్దరి అఫైర్ బ్రేకప్ కావడం.. మధ్యలో కృతి ఖర్బందా దూరిపోవడం జరిగిపోయింది.

 సహచర నటుడితో హాట్ హాట్'గా

సహచర నటుడితో హాట్ హాట్'గా

బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు వీరేయ్ కి వెడ్డింగ్, పాగల్ పంతి చిత్రాల్లో కృతి ఖర్బందా నటించింది. ఆ చిత్రంలో సహచర నటుడు పుల్కిత్ సమ్రాట్‌తో రిలేషన్‌షిప్ పెరిగింది. అప్పటి నుంచి వారిద్దరూ జోరుగా డేటింగ్ చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పుల్కిత్‌తో అఫైర్ గురించి కృతి స్పందించారు.

ఏమనుకొన్నా పట్టించుకోను

ఏమనుకొన్నా పట్టించుకోను

ఫ్యాన్స్, ప్రేక్షకులు మా అఫైర్ గురించి అలా ఆలోచిస్తే మంచిదే. మేమిద్దరం మంచి జోడి అని భావిస్తున్నారేమో. ప్రజలు ఏమని అనుకొన్నా పెద్దగా పట్టించుకోను. మా డేటింగ్ గురించి అవును అనలేను.. అలాగని కాదు అని కూడా చెప్పలేను అని కృతి చెప్పింది. దాంతో కృతి డేటింగ్‌పై ఓ అంచనాకు వచ్చింది.

నా అఫైర్ ఆయనతో.. రాయరేంటి?

నా అఫైర్ ఆయనతో.. రాయరేంటి?

యామితో పుల్కిత్.. కృతితో పుల్కిత్ అనే హెడ్డింగులు చికాకు పెడుతాయి. అలాంటి వార్తలను నేను పెద్దగా పట్టించుకోను. ఎంటర్‌టైన్ రంగంలో ఉన్నాను కాబట్టి ఇలాంటి వార్తలు, గాసిప్స్ సహజమే. వరుణ్ శర్మతో మాత్రమే నా అఫైర్ కొనసాగుతున్నది. ఆ విషయం గురించి ఎవరు రాయరేంటి? ఆయనతో నేను రెండు సినిమాలు చేశాననే విషయాన్ని పట్టించుకోరేమిటి? ప్రస్తుతం కెరీర్ మీదే ఫోకస్ పెడుతున్నాను. ఆ విషయం గురించి రాస్తే సంతోషిస్తాను అని కృతి పేర్కొన్నది.

భార్యకు విడాకులిచ్చి

భార్యకు విడాకులిచ్చి

పుల్కిత్ గురించి చెప్పాల్సివస్తే.. ఇప్పటికే ఆయన వివాహితుడు. భార్య శ్వేతా రోహిరాతో విభేదాల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత యామి గౌతమ్‌తో అఫైర్‌ను కొనసాగించాడు. కాగా ఇప్పుడు కొత్తగా కృతితో బంధం తెరపైకి వచ్చింది. ఇలా అఫైర్లు, డేటింగ్‌లతో పుల్కిత్ మీడియాలో కనిపించడం ఆయనకు కొత్తేమీ కాదు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

హౌస్‌ఫుల్ 4 చిత్రంలో

హౌస్‌ఫుల్ 4 చిత్రంలో

కృతి విషయానికి వస్తే.. తెలుగులో అలా మొదలైంది, మిస్టర్ నూకయ్య, ప్రేమ అడ్డా, ఒంగోలు గిత్తా, ఓం 3డీ, బ్రూస్‌లీ: ది ఫైటర్ చిత్రాల్లో నటించింది. తాజాగా అక్షయ్ కుమార్తో కలిసి హౌస్‌ఫుల్ 4 చిత్రంలో నటించింది. ఈ చిత్రం అక్టోబర్ 25వ తేదీన రిలీజ్ కానున్నది. ఇంకా కొన్ని చిత్రాల్లో నటిస్తు పరిశ్రమలో మరింత గుర్తింపు తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X