సన్నీలియోన్ వీడియో వైరల్, మిస్టరీ వ్యక్తి ఎవరు.. విరాట్ కోహ్లీ అంటూ ప్రచారం!
శృంగార తార సన్నీలియోన్ తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. ఐటెం సాంగ్స్, గ్లామర్ రోల్స్‌తో సన్నీలియోన్ బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అశ్లీల చిత్రాలకు ముగింపు పలికి ప్రస్తుతం సన్నీలియోన్ నటిగా దూసుకుపోతోంది. సౌత్ లో కూడా సన్నీలియోన్‌కు మంచి అవకాశాలు వస్తున్నాయి. సన్నీలియోన్ కు యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సన్నీలియోన్‌కి సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ వీడియో నెటిజన్లని తెగ ఆకర్షిస్తోంది.

అభిమానులు వెంటపడుతూ
సన్నీలియోన్ ఎక్కడ కనిపించినా అభిమానులు ఆమెని చుట్టుముడుతుంటారు. గతంలో సన్నీలియోన్ ఓ సారి కేరళ వెళ్లిన సమయంలో సన్నీలియోన్ ని చూసేందుకు వచ్చిన జనంతో రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆ సమయంలో సన్నీలియోన్ క్రేజ్ చూసి అంతా ఆశ్చర్యపోయారు కూడా. బాలీవుడ్ చిత్రాలతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సన్నీలియోన్ ప్రస్తుతం సౌత్ చిత్రాలలో కూడా రాణిస్తోంది.

మిస్టరీ వ్యక్తి ఎవరు
సన్నీలియోన్ విమానాశ్రయం నుంచి వస్తున్న ఓ వీడియో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. సన్నీలియోన్ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు అని అంతా ఆరా తీస్తున్నారు. సన్నీలియోన్ అతడితో సరదాగా మాట్లాడుతూ వస్తుండడంతో తెలిసిన వ్యక్తా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కేవలం అభిమాని అయితే సన్నీలియోన్ అతడితో నడుచుకుంటూ అంతసేపు మాట్లాడే అవకాశం లేదని అంటున్నారు.

విరాట్ కోహ్లీ
ఈ వీడియోని చూసిన కొందరైతే అతడు విరాట్ కోహ్లీనా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీతో అతడికి కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి. అతడిని చూసిన వెంటనే ఒక్క క్షణం పాటు విరాట్ కోహ్లీ అని భ్రమ పడక తప్పదు. కానీ అతడు విరాట్ కోహ్లీ కాదు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో బెంగుళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
సన్నీలియోన్ మేనేజర్
ఆ మిస్టరీ వ్యక్తి ఎవరో తెలియక అంతా తికమక పడుతున్న సమయంలో క్లారిటీ వచ్చింది. అతడు ఎవరూ కాదు సన్నీలియోన్ మేనేజర్ రజిని. వైరల్ భయాని మొదట ఈ వీడియోని షేర్ చేసి ఆటను విరాట్ కోహ్లీ లాగా ఉన్నదంటూ కామెంట్ చేశాడు. తనని విరాట్ కోహ్లీతో పోల్చడంపై రజిని కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు.


Click it and Unblock the Notifications











