‘ఆదిపురుష్’ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర: స్టార్ హీరో చేసిన పని వల్లే అలా.. బాలీవుడ్‌లో సంచలనం!

పేరుకు తెలుగు హీరోనే అయినా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని గడించాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' అనే ఒకే ఒక్క సినిమాతో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి తన రేంజ్‌కు తగ్గట్లుగానే పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తున్నాడు. అందులో 'ఆదిపురుష్' అనే హిందీ చిత్రం కూడా ఉంది. దీని ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నాడు ప్రభాస్. ఇక, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం రోజు భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీని వెనుక భారీ కుట్ర ఉందంటూ తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

‘ఆదిపురుష్'గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు

‘ఆదిపురుష్'గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు

యంగ్ రెబెల్ స్టార్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్న విషయం తెలిసిందే.

రామాయణంలో ఎవరూ టచ్ చేయని కథతో

రామాయణంలో ఎవరూ టచ్ చేయని కథతో

చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో.. రామయాణంలో ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌తో 'ఆదిపురుష్' రూపొందుతోంది. ఈ చిత్రంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నాడు. ఇక, ఇందులో సీతగా ఎవరు చేస్తున్నారన్న దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు.

షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో

షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో

ఫిబ్రవరి 2వ తేదీన 'ఆదిపురుష్' మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. ముంబైలో వేసిన భారీ సెట్‌లో పూజా కార్యక్రమాలు సైతం జరిగాయి. సరిగ్గా అప్పుడే అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం అయితే లేదు కానీ.. ఆస్తి నష్టం మాత్రం బాగా జరిగింది. ఈ ఘటనతో అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి.

లేటుగా వెలుగులోకి వచ్చిన షాకింగ్ న్యూస్

లేటుగా వెలుగులోకి వచ్చిన షాకింగ్ న్యూస్

'ఆదిపురుష్' సెట్‌లో అగ్నిప్రమాదం జరిగి దాదాపు నెల రోజులు అయిపోవడంతో అంతా దీని గురించి మర్చిపోయారు. అదే సమయంలో చిత్ర యూనిట్ కూడా సినిమా పనులతో బిజీగా గడుపుతోంది. షూట్ కోసం ప్రభాస్ రెడీ అవుతుండడంతో దానికి సంబంధించిన ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

‘ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర

‘ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర

బాలీవుడ్‌లో సంచలనం అవుతోన్న షాకింగ్ న్యూస్ ప్రకారం.. 'ఆదిపురుష్' సెట్‌లో జరిగింది ప్రమాదం కాదట. కొందరు దుండగులు కావాలనే అక్కడ మంటలు పెట్టారని ఓ వార్త కలకలం రేపుతోంది. సరిగ్గా సినిమా ప్రారంభం అవుతోన్న రోజే ప్లాన్ ప్రకారం ఇలా చేశారని బీ టౌన్‌లో పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో ఈ విషయం టాలీవుడ్ వరకూ వెనువెంటనే పాకేసింది.

స్టార్ హీరో చేసిన పని వల్లే ఈ పరిస్థితి అంటూ

స్టార్ హీరో చేసిన పని వల్లే ఈ పరిస్థితి అంటూ

కావాలనే కొందరు 'ఆదిపురుష్' సెట్‌లో ప్రమాదాన్ని సృష్టించడంపై బాలీవుడ్‌లో లోతుగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సరికొత్త విషయం తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ ఘటన వెనుక బాలీవుడ్ సీనియర్ హీరో, ఇందులో రావణుడిగా నటిస్తోన్న సైఫ్ అలీ ఖాన్ చేసిన పని ఉందని చెబుతున్నారు. దీంతో ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

 అప్పుడలా చెప్పడంతో.. అసలేం జరిగిందంటే?

అప్పుడలా చెప్పడంతో.. అసలేం జరిగిందంటే?

కొద్ది రోజుల క్రితం సైఫ్ 'ఆదిపురుష్' గురించి మాట్లాడుతూ.. 'రావణుడిలోని మానవత్వ కోణాన్ని ఆవిష్కరించే సినిమాలో ఇది. ఆయన రాముడితో ఎందుకు యుద్ధం చేశాడన్న దాన్ని పాజిటివ్‌గా చూపించబోతున్నాం' అంటూ కామెంట్లు చేశాడు. దీనిని చాలా మంది వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలే సెట్‌లో జరిగిన ఘటనకు కారణం అని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X