వీర్ ది వెడ్డింగ్ ఆ సినిమాకు కాపీనా?.. బూతు, అశ్లీల హాస్యంతో కిక్కిస్తూ.. క్రేజీగా!

By Rajababu

Recommended Video

Veere Di Wedding Movie Makes Sensations In India

అడల్ట్ కామెడీతో రూపొందిన వీర్ ది వెడ్డింగ్ చిత్రంపై సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. నలుగురు బాల్య స్నేహితురాళ్ల జీవితం, వారి లైఫ్‌లో చోటుచేసుకొన్న సంఘటనలు ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు, డైలాగ్స్ కేవలం పెద్దలకు మాత్రమే అనే రేంజ్‌లో ఉండటం, కొన్ని సీన్లు వివాదాస్పదంగా మారడంతో ఈ సినిమాపై క్రేజ్ పెరుగుతున్నది.

సెక్స్ అండ్ ది సిటీ మూవీకి కాపీనా?

సెక్స్ అండ్ ది సిటీ మూవీకి కాపీనా?

వీర్ ది వెడ్డింగ్ చిత్రంలో కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరభాస్కర్, శిఖా తల్సానియా నటించారు. అయితే హాలీవుడ్‌లో రూపొందిన సెక్స్ అండ్ ది సిటీ చిత్రానికి దాదాపు దగ్గరవుండటం వల్ల ఆ చిత్రానికి కాపీ అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

నలుగురు యువతుల కథ

నలుగురు యువతుల కథ

సెక్స్ అండ్ ది సిటీ, వీర్ ది వెడ్డింగ్ రెండు చిత్రాల్లోనూ కథ నలుగురు అమ్మాయిలదే. మిరాండా పోషించిన పాత్రను హిందీలో అవనీ (లాయర్) రోల్‌ను సోనమ్ కపూర్ పోషించారు. పెళ్లి కంటే కెరీర్‌ ముఖ్యమని భావించే నవతరం అమ్మాయి.

మధ్య వయసులో తల్లిగా

మధ్య వయసులో తల్లిగా

నలుగురు స్నేహితురాళ్లలో మీరా (శిఖా తల్సానియా) మధ్య వయసులో ఉన్న యువతి పాత్రను పోషించారు. చిన్న వయసులో తల్లి బాధ్యతను మోస్తూ చికాకు పడే పాత్ర. సెక్స్ అండ్ సిటీలో చార్లేట్ (క్రిస్టిన్ డెవిస్) పోషించింది.

 భావోద్వేగమైన పాత్రలో కరీనా

భావోద్వేగమైన పాత్రలో కరీనా

కాళింది పాత్రలో కరీనా కపూర్ కనిపిస్తారు. సంపన్న యువతిగా, కమిట్‌మెంట్, పెళ్లిపై ఒకరకమైన కన్‌ఫ్యూజ్‌లో ఉండే పాత్రను పోషించారు. తల్లి మరణించిన తర్వాత తండ్రి మరొకరిని పెళ్లి చేసుకోవడంతో ఒంటరితనంతో బాధపడుతుంది. ఆస్తి సంబంధిత విభేదాల వల్ల తండ్రి, బాబాయ్ మధ్య దూరం పెరుగుతుంది. బాల్యంలో పెరిగిన ఇళ్లు కోర్టు వివాదంలో చిక్కుకోవడం మరింత ఆవేదనకు గురి అవుతారు.

మక్కికి మక్కీ కాపీనట

మక్కికి మక్కీ కాపీనట

కరీనా పెళ్లి చేసుకోవాలనుకొన్న ప్రియుడి కుటుంబ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతుంది. తన స్నేహితురాలు కరీనాకు ఎదురైన సమస్యను సోనమ్ కపూర్ తీర్చడమనేది సెక్స్ అండ్ ది సిటీలో కూడా కనిపిస్తుంది.

 ఇంగ్లీష్ చిత్రం నుంచి దిగుమతి

ఇంగ్లీష్ చిత్రం నుంచి దిగుమతి

పెళ్లిలో కరీనా తన తల్లి ధరించిన దుస్తులను కట్టుకోవాలని భావిస్తుంది. అలాంటి సీను కూడా సెక్స్ అండ్ ది సిటీ చిత్రంలోనూ కనిపిస్తుంది. ఇలా ఎన్నో సెక్స్ అండ్ ది సిటీ అనే చిత్రం నుంచి దిగుమతి చేసుకొన్నట్టు స్పష్టంగా సగటు ప్రేక్షకుడికి కూడా అర్థం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X