దివాళా తీసి దారుణ పరిస్థితుల్లో.. ది కశ్మీర్ ఫైల్స్ సక్సెస్‌తో ఒరిగిందేమీ లేదు.. వివేక్ అగ్నిహోత్రి సంచలన
సంచలన విజయం సాధించిన ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ బ్లాక్ బస్టర్ అయినా నేను ఇంకా దివాళా స్థితిలోనే ఉన్నానని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న వ్యాక్సిన్ వార్ సినిమా గురించి, తన భవిష్యత్ ప్లాన్స్ గురించి వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..
బాలీవుడ్ అగ్ర నటులు మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్‌తో కశ్మీర్‌లోని పండితులపై మిలిటెంట్ల అఘాయిత్యాలపై తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఘన విజయం సాధించినప్పటికీ నాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆ సినిమా సక్సెస్ అయితే జీ కంపెనీ వాళ్లకు భారీగా మేలు జరిగింది. జీ నిర్మించడం వల్ల వారికి భారీగా డబ్బు వచ్చింది. నాకు పెద్దగా మనీ రాలేదు. ది కశ్మీర్ ఫైల్ సినిమా ద్వారా వచ్చిన డబ్బంతా నేను వాక్సిన్ వార్ సినిమా కోసం ఖర్చు పెడుతున్నాను. దాంతో నేను ఇప్పటికీ నేను దివాళా స్థితిలోనే ఉన్నాను. మా ఆర్థిక పరిస్థితి గురించి నా భార్య పల్లవి జోషితో చర్చిస్తుంటాను అని వివేక్ అగ్నిహోత్రి చెప్పారు.
సక్సెస్ అనే విషయంపై నాకు క్లారిటీ ఉండదు. విజయం అనేది మన చేతిలో ఉండదు. వ్యాక్సిన్ వార్ సినిమా విజయం సాధిస్తుందో లేదో చెప్పలేను. నేను స్ట్రగుల్ అనే సినిమా చేస్తున్నాను. వ్యాక్సిన్ సినిమాలో హింసను ప్రేరేపించలేదు. వాస్తవాలను సినిమాలో చూపించాను. మానవత్వంపై జరిగిన దాడులను చూపిస్తే నాపై కూడా దాడులు జరిగాయి అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత వెబ్ సిరీస్‌తో వివేక్ అగ్నిహోత్రి వస్తున్నాడు. ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ వెబ్ సిరీస్‌ను జీ5 ఓటీటీలో ఆగస్టు 11 రిలీజ్ కానున్నది. కశ్మీర్‌లో హిందువులపై దాడి గురించి వివరంగా చూపించేందుకు సిద్దమవుతున్నాడు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ది వ్యాక్సిన్ వార్ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, సప్తామీ గౌడ్, నానా పాటేకర్ తదితరులు నటించారు. కోవిడ్ వ్యాక్సిన్ 19 తయారీ సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా దసరా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.


Click it and Unblock the Notifications











