స్టార్ సెలెబ్రిటీల పెళ్లి వేడుకలో హాటెస్ట్ పాప్ స్టార్ చిందులు!
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థ వేడుక ఇటలీలోని సరస్సులో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇషా అంబానీ, ఆనంద్ వివాహం త్వరలోనే జరగబోతోంది. నిశ్సితార్థ వేడుకే అంత వైభవంగా జరిగితే ఇక పెళ్లి వేడుక ఏస్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. బాలీవుడ్ ప్రముఖుల నిశ్చితార్థానికి హాజరయ్యారు. కళ్ళు చెదిరేవింధంగా ఉదయ్ పూర్ లో వివాహ వేడుక, సంగీత్ వేడుకని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో జరగనున్న ఈవేడుక గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

సంగీత్‌లో పాప్ స్టార్ చిందులు
ముఖేష్ అంబానీ తన కుమార్తె వివాహ వేడుకని కనీవినీ ఎరుగని విధంగా జరపాలని భావిస్తున్నారు. హాలీవుడ్ అందాల తార, పాప్ స్టార్ అయిన బియాన్స్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. పాప్ స్టార్ గా బియాన్స్ ఎంత పాపులరో అందరికి తెలిసిందే. సంగీత్ సెర్మనీలో బియాన్స్ పెర్ఫామ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ సెలెబ్రటీలు
బాలీవడ్ స్టార్ హీరోయిన్ల నృత్య ప్రదర్శనకు కూడా ముకేశ్ అంబానీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా డిసెంబర్ 8,9 తేదీల్లో భారీ స్థాయిలో ప్రీ వెడ్డింగ్ సెర్మనీ నిర్వహించి ఆ తరువాత 10న వివాహ వేడుక జరగబోతున్నట్లు సమాచారం.

చిన్ననాటి స్నేహితుడు
ఇషా అంబానీకి కాబోయే భర్త ఆనంద్ ఆమెకు చిన్ననాటి స్నేహితుడే కావడం విశేషం. ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ పిరమాల్ కుమారుడే ఆనంద్. కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

లవ్ ప్రపోజ్
ఆనంద్ ఈ ఏడాది ఆరంభంలోనే ఇషా అంబానీకి లవ్ ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇషా అంబానీకి ఆనంద్ ప్రేమకు అంగీకారం తెలపడంతో ఈజంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం బాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications











