అంబానీ ఇంట్లో పెళ్లికి క్రేజీ పాప్‌స్టార్.. 100 చార్టెడ్ ఫ్లయిట్స్.. క్లింటన్ హాజరు!
Recommended Video

దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి కనీవిని ఎరుగని విధంగా జరుగబోతున్నది. అందరూ నోరెళ్లబెట్టే విధంగా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజస్థాన్‌లో జరుగనున్న పెళ్లికి అమెరికా పాప్ స్టార్ బెయాన్స్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నది. అంతేకాకుండా పెళ్లికి సంబంధించిన విషయాలు అత్యంత చర్చనీయాంశంగా మారనున్నాయి. వివరాల్లోకి వెళితే..

మూడు రోజులు వేడుకలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, ఆనంద్ ఫిరమిల్ వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో మంగళవారం జరుగనున్నది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన వేడుకలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే గానా భజానాకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఉదయ్ పూర్‌కు బెయాన్స్ రాక
ఇషా అంబానీ పెళ్లి వేడుకల్లో అమెరికా సింగర్ బెయాన్స్ ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నారు. పాప్ సంచలనంగా పేరొందిన బెయాన్స్ తన బృందంతో శని, ఆదివారాల్లో ఉదయ్‌పూర్‌కు చేరుకోనున్నారు.

బెయాన్స్ గురించి
అమెరికాకు చెందిన బెయాన్స్ అసలు పేరు బెయాన్స్ జిసిల్లే నోలెస్. ఆమె భర్త పేరు జే జెడ్. ఈమెకు ముగ్గురు సంతానం. గాయనిగా, రచయిత, నటిగా, డ్యాన్సర్‌గా అత్యంత ప్రజాదరణ ఉంది. ఈ రూపొందించిన ఆల్బమ్స్ మంచి క్రేజ్ ఉంది.

100 చార్టెట్ ఫ్లయిట్స్
ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగే పెళ్లికి బాలీవుడ్, అంతర్జాతీయ ప్రముఖులు భారీ హాజరుకానున్నారు. ప్రముఖులను ఉదయ్ పూర్‌కు తరలించేందుకు 100 చార్టెట్ ఫ్లయిట్లను ఏర్పాటు చేశారు. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ఉదయ్ పూర్ విమానాశ్రయం సందడి సందడిగా మారింది.

బిల్ క్లింటన్ రాక
అంబానీ ఇంట్లో పెళ్లికి అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరి క్లింటన్ హాజరుకానున్నారు. వీరితోపాటు దేశంలోని పలువురు పారిశ్రామిక వేత్తలు, సినీ నటులు భారీగా తరలివెళ్లే అవకాశాలు ఉన్నాయి.

రూ.3 లక్షలతో పెళ్లి పత్రిక
ఇషా అంబానీ పెళ్లికి సంబంధించిన ఒక్కో ఆహ్వాన పత్రిక కోసమే లక్షలు ఖర్చు చేశారు. వజ్రాలు, నగలు పొదగిన పెళ్లి పత్రిక కోసం రూ.3 లక్షలు ఖర్చు చేశారు. ఈ పెళ్లి పత్రిక గురించి మీడియాలో చర్చ జరిగింది.


Click it and Unblock the Notifications











