For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒంటరిగా రమ్నన్నాడు.. అసభ్యంగా తాకాడు.. నాగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

    |

    సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు, అప్పుడప్పుడే ఎదుగుతున్న వారికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఈ సమాజం వాటికి క్యాస్టింగ్ కౌచ్, మీటూ లాంటి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడే ప్రతిఘటించాలని, కాలం గడిచాక కాదంటూ కొందరు కామెంట్ చేసినా.. కనీసం ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, ఇంకా ధైర్యంగా గళమెత్తాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో చంద్రలేఖ చిత్రంలో నాగార్జునతో జతకట్టిన హీరోయిన్ ఇషా కొప్పికర్ సంచలన విషయాన్ని బయటపెట్టారు.

    మీటూపై నాగ్ హీరోయిన్..

    మీటూపై నాగ్ హీరోయిన్..

    హాలీవుడ్‌లో మొదలైన ఈ వ్యవహారం.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతీచోటకు పాకింది. ప్రతీ రోజూ ఎవరో ఒకరు ఏదో ఘటన గురించి చెబుతూనే ఉన్నారు. తమకు కూడా అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. చంద్రలేఖ సినిమాలో నాగార్జునకు జోడిగా నటించిన హీరోయిన్ ఇషా కొప్పికర్ తనకు ఎదురైన సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

    ఒంటరిగా కలవమని..

    ఒంటరిగా కలవమని..

    పురుషాధిక్యత.. బంధుప్రీతి.. దురుసుతనం.. వేధింపులు.. ఫేవరిటిజం లాంటి వాటి వల్ల ఎన్నో ఇబ్బందుల్ని తాను ఎదుర్కొన్నానని ఇషా ఓ ఇంటర్వ్యూల్లో చెప్పింది.ఒకసారి ఓ పెద్ద స్టార్ నన్ను ఎవరూ లేకుండా ఒంటరిగా కలవమని అడిగాడు. కనీసం కార్ డ్రైవర్ కూడా ఉండకూడదని కండీషన్ పెట్టాడు. ఆయనకు ఫుల్ బిజీ షెడ్యూల్ ఉండి కూడా అడిగాడు. అయితే తానేమీ చిన్నపిల్లను కాదు కాబట్టి ఆయన ఇంటెన్షన్ ఏమిటో తనకు అర్థమైందని తెలిపింది. దాంతో నిర్మాతకు ఓ మాట చెప్పానని.. తాను నటించేందుకు వస్తాను తప్ప కాంప్రమైజ్ కి రాలేను అని బల్లగుద్దినట్టు చెప్పేశానని పేర్కింది.. ఆ తర్వాత తనకు ఊహించని ట్రీట్ ఎదురైందని తెలిపింది.

    ప్రాజెక్ట్ నుంచి తొలగించేశారు..

    ప్రాజెక్ట్ నుంచి తొలగించేశారు..

    కమిట్ మెంట్ కి అంగీకరించకపోవడంతో..ఆ స్టార్ హీరోకి సన్నిహితంగా ఉండే కథానాయికను ఆ ఆఫర్ వరించిందని చెప్పుకొచ్చింది. అయితే తనను ఆ సినిమా నుంచి తొలగించేప్పుడు ఆ నిర్మాత కానీ స్టార్ కానీ తనకు చెప్పనేలేదని పేర్కొంది. సదరు సూపర్ స్టార్ కి క్లోజ్ రిలేటివ్ ని పెట్టుకున్నారని ఆ తర్వాత తెలిసిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ సంగతులేవీ తెలియని తాను రెడీ అయ్యి ఫిలిం ముహూర్తపు షాట్ కి వెళ్లే ముందు ఆ సంగతి వెల్లడైందని నాటి ఘటనను గుర్తు చేసుకుంది.

    కుటుంబం అండగా..

    కుటుంబం అండగా..

    పరిశ్రమలో ఎలాంటి సన్నివేశం ఎదురైనా.. నా వెంట నన్ను ఆదుకునే అద్భుతమైన కుటుంబం ఉంది. అందుకే ఇలాంటి అభద్రతా ప్రపంచంలోనూ రాటు దేలాను. తల వొంచకుండా తలెత్తుకుని ఎదిరించాను! అని ఇషా తెలిపింది. ఒంటరిగా ముంబైలో ఉండాలని వచ్చినా నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను తప్ప వేరే సమస్యలేవీ లేవు అని షాకింగ్ నిజాల్ని పూస గుచ్చింది.

    సెక్రటరీలు కూడా వదలరు..

    సెక్రటరీలు కూడా వదలరు..

    సినీపరిశ్రమలో బిగ్ స్టార్స్ తో సన్నిహితంగా ఉండే సెక్రటరీలతోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని సార్లు వారు కూడా అమర్యాదగా ప్రవర్తించారని తెలిపింది. టాప్ సెక్రటరీలు తనను అసభ్యంగా తాకారని చెప్పుకొచ్చింది.

    English summary
    Isha Koppikar About Casting Couch Star Hero Told That Meet Him Alone With Out Driver. And She Reveals That Top Secretaries Also have touched her inappropriately.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X