డబ్బు ఎంతైనా ఇస్తా, వదిలేయండి.. పోలీసులతో స్టార్ హీరో తమ్ముడు, ఏం జరిగిందటే!

Recommended Video

Ishaan Khatter Gets In Trouble After Parking Bike In No-Parking Zone || Filmibeat Telugu

షాహిద్ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. విలక్షణమైన పాత్రలతో షాహిద్ అభిమానులని మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ కూడా ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు. ఇషాన్ ఇప్పటికే దఢక్, బియాండ్ ది క్లౌడ్స్ లాంటి చిత్రాల్లో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇషాన్ మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. తాజాగా ఇషాన్ ఖట్టర్ తన నిర్లక్ష్యం కారణంగా వార్తల్లో నిలిచాడు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా

ఇటీవల ఇషాన్ ఖట్టర్ బాంద్రాలోని ఓ రెస్టారెంట్ కు బైక్ పై వచ్చాడు. అలా చేయడమే ఇషాన్ ని ఇబ్బందుల్లో పడేసింది. పలువురు సినీతారలు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు మీరడం, రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా అనేక రకాలుగా సినీతారలు కేసుల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇషాన్ కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది.

 బైక్‌పై రెస్టారెంట్‌కు

బైక్‌పై రెస్టారెంట్‌కు

ఇషాన్ ఖట్టర్ ఇటీవల బాంద్రాలోని ఓ రెస్టారెంట్ కు బైక్ పై వెళ్ళాడు. ఇషాన్ కు బైక్స్ అంటే చాలా ఇష్టమట. తన బైక్ ని నో పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసి రెస్టారెంట్ కు వెళ్ళాడు. ట్రాఫిక్ పోలీసులు ఇషాన్ బైక్ ని ఎత్తుకెళుతున్నారని రెస్టారెంట్ సిబ్బంది అతడితో చెప్పడంతో పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. నో పార్కింగ్ ప్లేస్ లో బైక్ ఉంచకూడదనే విషయం తెలియదా అని ట్రాఫిక్ పోలీసులు అతడిని గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది.

ఎంత డబ్బైనా ఇస్తా

ఎంత డబ్బైనా ఇస్తా

పోలీసులు ఇషాన్ బైక్ ని ట్రక్కులోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. దీనితో ఇషాన్ పోలీసులని బ్రతిమాలాడుకున్నాడు. జరిమానా ఎంతైనా కడతానని దయచేసి బైక్ తీసుకెళ్లొద్దని కోరాడట. పోలీసులు అతడికి రూ 500 జరిమానా విధించి విడిచిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సైఫ్ కూతురు కూడా

కొన్ని రోజుల క్రితం సైఫ్ అలీఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీఖాన్ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఇబ్బందులు ఎదుర్కొంది. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కింది. దీనితో పోలీసులు ఆమెకు వార్నింగ్ ఇచ్చి పంపారు.ఇషాన్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు. జాన్వీ కపూర్ తొలి చిత్రం దఢక్ లో ఇతడే హీరో. వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందనే ప్రశంసలు కూడా దక్కాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X