ఇద్దరు హీరోయిన్లతో ఇరుకుపడ్డ యువ హీరో.. జాహ్నవి కోసం అర్ధనగ్నంగా!

Recommended Video

Did Ishaan Khatter Go Shirtless To Save Janhvi Kapoor? || Filmibeat Telugu

ధడక్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ జాహ్నవి కపూర్, హీరో ఇషాన్ కట్టర్ తమ తొలి చిత్రం షూటింగ్ సమయంలో సన్నిహితంగా మారారనే విషయం మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. తాజాగా జాహ్నవితో డేటింగ్ విషయాన్ని ఇషాన్ ఖండించడమే కాదు.. ఆమె కోసం అర్ధనగ్నంగా మారడం మరింత ఆసక్తిగా మారింది. బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ సోదరుడిగా సుపరితుడైన ఇషాన్ కట్టర్ తాజాగా నేహాదూపియా నిర్వహించే టాక్ షోలో పాల్గొన్నాడు. తన సోదరుడు షాహీద్ మాజీ ప్రియురాళ్లలో ఎక్కువగా ఎవరు ఇష్టం అనే ప్రశ్నకు ప్రియాంక చోప్రా అని ఠక్కున సమాధానం ఇచ్చాడు.

Ishaan Khatter removes shirt for Janhvi Kapoor in Neha Dhupia show

నేహా దూపియా షోలో ఆసక్తికరంగా సమాధానాలతో ఆకట్టుకొన్న ఇషాన్‌ ఓ సందర్భంలో ఇరుకునపడిపోయాడు. ఈ షోలో నిజమైనా చెప్పాలి లేకపోతే ఒంటి మీద షర్ట్ విప్పేయాలే అనే రౌండ్‌లో ఈ కుర్ర హీరో ఇబ్బంది పడ్డాడు.

బాలీవుడ్‌లోని యువ హీరోయిన్లు జాహ్నవి కపూర్, సారా ఆలీ ఖాన్, తారా సుతారియా, అనన్య పాండే‌లో ఎవరు ఎక్కువ ప్రతిభావంతులు అనే ప్రశ్నకు ఇషాన్ నీళ్లు మింగాడు. తారా సుతారియా, అనన్య పాండే సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి వారిద్దరి గురించి నేను ఎక్కువగా చెప్పలేనని ప్రశ్నను దాట వేసేందుకు ప్రయత్నించాడు. అయితే జాహ్నవి, సారాలో ఎవరు గొప్ప అనే ప్రశ్నలో మళ్లీ ఇరుకున పడ్డారు.

Ishaan Khatter removes shirt for Janhvi Kapoor in Neha Dhupia show

జాహ్నవి, సారా నాకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కాబట్టి వారిలో ఒకరి గురించి తక్కువ చెబితే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నా ఒంటిపై షర్ట్‌ను విప్పేస్తాను అని ఇషాన్ చెప్పి ఆ పని ముగించేశాడు. అలా జాహ్నవి కోసం అర్ధనగ్నంగా మారాడనే విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X