వీడియో: జింగ్..జింగ్.. జింగాత్.. రెచ్చిపోయి డాన్స్ చేసిన జాన్వీ, ఇషాన్.. 19 మిలియన్ల వ్యూస్!
Recommended Video

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ డెబ్యూ మూవీ ధఢక్ జులై లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జాన్వీ, ఇషాన్ జంటగా నటించారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఆ మధ్యన ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. తొలి ప్రయత్నంలోనే జాన్వీ బాగా నటించిందని ప్రశంసలు అందుకుంది. ధఢక్ చిత్రంలో జింగాత్ అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో సాంగ్ సంచలనం సృష్టిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సాంగ్ 19 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.

జాన్వీ పైనే అందరి చూపు
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. ధఢక్ చిత్రం ఆమెకు డెబ్యూ మూవీ కావడంతో అందరి దృష్టి జాన్వివైపే ఉంది. తొలి చిత్రంలో జాన్వీ ఎలా నటించింది అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో జాన్వీ కపూర్ ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేసింది.

ఇషాన్, జాన్వీ జంటగా
ఈ చిత్రంలో ఇషాన్, జాన్వీ కపూర్ జంటగా నటించారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా ధఢక్ చిత్రం తెరకెక్కుతోంది. ట్రైలర్ లో జాన్వీ కపూర్ అందమైన హావభావాలు పలికించింది. రొమాంటిక్ సన్నివేశాల్లో బెరుకు లేకుండా నటించింది.
డాన్స్ కుమ్మేశారు
ఇటీవల చిత్ర యూనిట్ ఈ చిత్రంలోని జింగాత్ అనే వీడియో సాంగ్ ని విడుదల చేశారు. కేవలం రెండు రోజుల్లోనే 19 మిలియన్ల వ్యూస్ తో ఈ వీడియో దూసుకుపోతోంది. ఈ సాంగ్ లో ఇషాన్, జాన్వీ రెచ్చిపోయి డాన్స్ చేశారు. జాన్వీ డాన్స్ మూమెంట్స్ బావున్నాయంటూ ప్రశంసలు అందుతున్నాయి.
రిహార్సల్స్ వీడియో కూడా
ఈ సాంగ్ కోసం జాన్వీ, ఇషాన్ రిహార్సల్స్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఇది కూడా వైరల్గా మారింది. జాన్వీ ప్రతి డాన్స్ మూమెంట్ ని పక్కాగా చేస్తోంది. సినిమాలో జాన్వీ పెర్ఫామెన్స్ ఎలా ఉందొ ధఢక్ విడుదలయ్యాక తేలనుంది.


Click it and Unblock the Notifications











