ఇస్మార్ట్ శంకర్ హిందీ రీమేక్.. స్టార్ హీరో స్పెషల్ ఫోకస్
సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యువ హీరో రామ్ కలయికలో వచ్చిన డిఫరెంట్ మాస్ మసాలా మూవీ ఇస్మార్ట్ శంకర్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ నటన పూరి డైలాగ్స్ అలాగే మణిశర్మ సంగీతం సినిమాకు ఎంతగానో క్రేజ్ అంధించాయి. ఇక ఇప్పుడు ఆ హిట్టు సినిమా హిందీలో కూడా రూపొందే అవకాశం ఉందట. గత ఏడాది నుంచి బాలీవుడ్ రీమేక్స్ రూమర్స్ అయితే చాలానే వస్తున్నాయి.
ఇక ఫైనల్ గా ఒక హీరో ఇస్మార్ట్ శంకర్ కథపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు. యువతలో భారీ క్రేజ్ అందుకుంటున్న రణ్ వీర్ సింగ్. వరుస బాక్సాఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో ఇస్మార్ట్ శంకర్ పై ఇప్పటికే కొంతమంది దర్శలుకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదివరకే రన్ వీర్, జూనియర్ ఎన్టీఆర్ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ కథను రీమేక్ చేసి బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ మరోసారి పూరి కథపైనే ఫోకస్ పెట్టాడు.

ఇస్మార్ట్ శంకర్ కథకు రణ్ వీర్ అయితేనే కరెక్ట్ గా సెట్టవుతాడాని చాలా మంది నిర్మాతలు అతనితో సినిమాను నిర్మించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ స్టార్ హీరోతో చర్చలు జరిపి సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్ కథకు ఇప్పటికే నార్త్ ఆడియెన్స్ లో భారీ క్రేజ్ దక్కింది. హిందీలో డబ్ అయిన ఇస్మార్ట్ శంకర్ 137మిలియన్స్ వ్యూవ్స్ అందుకుంది. మరి రణ్ వీర్ ఈ సినిమాలో ఎంతవరకు కోత్తధనాన్ని తీసుకువస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











