For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ వయసులోనే ఎఫైర్ మొదలెట్టాడు.. దిశాతో అలాంటి రిలేషన్: టైగర్‌పై జాకీ ష్రాఫ్ సంచలన వ్యాఖ్యలు

  |

  మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో ప్రేమాయణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అక్కడ ఎంతో మంది హీరో హీరోయిన్లు ఇప్పటికే లవ్ ట్రాకులు నడిపారు. ఈ క్రమంలోనే ఎంతో మంది తమ బంధాన్ని మధ్యలోనే ఆపేయగా.. మరికొందరు మాత్రం పెళ్లి పీటలెక్కారు. ఇక, ఇప్పుడు కూడా పలు జంటలు బీ టౌన్‌లో విహరిస్తున్నాయి. అలాంటి వాటిలో టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జోడీ ఒకటి. చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్న వీళ్లిద్దరూ తరచూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టైగర్ తండ్రి, ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ దీనిపై స్పందించారు. ఆ సంగతులు మీకోసం!

   తెలుగు సినిమాతోనే దిశా పటానీ ఎంట్రీ

  తెలుగు సినిమాతోనే దిశా పటానీ ఎంట్రీ

  ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న దిశా పటానీ.. ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో తన అందచందాలతో ఆకట్టుకున్న ఆమె.. యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. దీని తర్వాత ఆమె నేరుగా బాలీవుడ్‌లోకే అడుగు పెట్టేసింది.

   తెలుగు సినిమా రీమేక్‌తో టైగర్ ప్రవేశం

  తెలుగు సినిమా రీమేక్‌తో టైగర్ ప్రవేశం

  బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ ‘హీరోపంటి' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పరుగు'కు రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమాలో డీసెంట్‌గా కనిపించిన అతడు.. ఆ తర్వాత ఫైటింగ్ సినిమాల్లో నటించాడు. ఫలితంగా అదిరిపోయే ఫిజిక్‌తో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

   ఆ సినిమా టైమ్‌లో ప్రేమలో పడిన జోడీ

  ఆ సినిమా టైమ్‌లో ప్రేమలో పడిన జోడీ

  ‘భాగీ 2' అనే సినిమాలో దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ జంటగా నటించారు. ఆ మూవీ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడిపోయారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఈ జంట రహస్యంగా తమ ప్రేమాయణాన్ని కొనసాగించింది. అప్పుడు జంటగా పలుమార్లు కెమెరా కంటికి చిక్కినప్పటికీ.. ప్రేమలో ఉన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో ఈ జోడీపై ఎన్నో వార్తలు వచ్చాయి.

   ఇద్దరూ స్టార్లుగా... వరుస సినిమాలతో

  ఇద్దరూ స్టార్లుగా... వరుస సినిమాలతో

  బాలీవుడ్‌లో దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ కొంత కాలంగా స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలోనే వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. అలాగే, ఒకదాని తర్వాత ఒకటి ఇలా జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నారు.

   జంటగా కనిపిస్తూ.. రచ్చ చేస్తోన్నారుగా

  జంటగా కనిపిస్తూ.. రచ్చ చేస్తోన్నారుగా

  ఎన్నో ఏళ్లుగా దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ డేటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్లపై ఎన్నో కథనాలు వెలువడ్డాయి. దీంతో పలుమార్లు దీని గురించి వీళ్లకు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇలాంటి సమయంలోనే తమ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఇక, అప్పటి నుంచి రెచ్చిపోయి రచ్చ చేస్తున్నారు. నిత్యం కలిసి కనిపిస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

  లాక్‌డౌన్‌లో అలా దొరికపోయిన జంట

  లాక్‌డౌన్‌లో అలా దొరికపోయిన జంట

  నిత్యం ఏదో ఒక టూర్ వెళుతూ తెగ ఎంజయ్ చేస్తున్నారు దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్. ఈ క్రమంలోనే ఇటీవల మాల్దీవులు ట్రిప్ వెళ్లారు. ఆ వెంటనే కరోనా ప్రభావం పెరగడంతో తిరిగి వచ్చేశారు. ఇక, లాక్‌డౌన్ సమయంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వీళ్లిద్దరూ కారులో ప్రయాణించారు. దీంతో ముంబై పోలీసులు వీళ్లను పట్టుకోవడంతో పాలు ఈ జంటపై కేసు కూడా నమోదు చేశారు.

  టైగర్ ఎఫైర్‌పై జాకీ ష్రాఫ్ షాకింగ్ కామెంట్

  టైగర్ ఎఫైర్‌పై జాకీ ష్రాఫ్ షాకింగ్ కామెంట్

  టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్ ఇటీవల ఓ నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీకి సంబంధించిన కష్టనష్టాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే తన కొడుకు గురించి చెబుతూ ‘టైగర్ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా వెళ్తున్నాడు. వాడి పట్ల సంతోషంగా ఉన్నాను. ఇక అతడు కేవలం 25వ ఏటనే డేటింగ్ కూడా మొదలెట్టేశాడు' అంటూ కొడుకు సీక్రెట్ లీక్ చేశారు.

  Seeti Maar From Radhe Released - Allu Arjun Reacts | Filmibeat Telugu
  వాళ్లిద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఉందని

  వాళ్లిద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఉందని

  టైగర్.. దిశ లవ్ గురించి మాట్లాడుతూ.. ‘టైగర్ ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నాడు. దిశతో అతడి బంధం చాలా బలమైంది. తన జీవితం గురించి నిర్ణయించుకునే స్థాయిలో టైగర్ ఉన్నాడు. కాబట్టి ఏది మంచో ఏది చెడో అతడికి తెలుసు. అందుకే తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము అడ్డు చెప్పాలనుకోవడం లేదు. ఏం చేసినా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాం' అని జాకీ చెప్పుకొచ్చారు.

  English summary
  Bollywood Stars Disha Patani and Tiger Shroff in a Living Relationship. Now Senior Actor Jackie Shroff Respond on his Son Love Affair.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X