twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కొడుకు 25 ఏళ్ల అమ్మాయితో ఉంటున్నాడు.. హీరోయిన్‌పై హీరో తండ్రి పరోక్షంగా!

    |

    ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్, హాట్ బ్యూటీ దిశా పాటని కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి బాగి 2 చిత్రంలో నటించారు. పబ్లిక్ గానే చట్టా పట్టాలేసుకుని తిరుగుతూ ఈ జంట మీడియాకు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ పైకి మాత్రం కేవలం ప్రెండ్ షిప్ అంటూ తప్పించుకుంటున్నారు. ఇద్దరూ కలసి వెకేషన్స్ కు వెళ్లడం.. షర్ట్ లేకుండా టైగర్.. బికినిలో దిశా కనిపించిన దృశ్యాలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన కొడుకు ప్రేమ వ్యవహారంపై టైగర్ తండ్రి జాకీ ష్రాఫ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

     25 ఏళ్ల అమ్మాయితో

    25 ఏళ్ల అమ్మాయితో

    జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. నా కొడుకు 25 ఏళ్ల అమ్మాయితో ఉంటున్నాడు. వారిద్దరూ కలసి స్నేహం చేస్తున్నారు. అంతకు ముందు నా కొడుకు ఏ మ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు అని జాకీ ష్రాఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి వ్యవహారం నా దృష్టికి వచ్చినట్లు కూడా జాకీ సరదాగా వ్యాఖ్యానించారు. బాలీవుడ్ లో తరచుగా వార్తల్లో నిలిచే జంటల్లో టైగర్ ష్రాఫ్, దిశా పటాని జోడి ఒకటి.

    పెళ్లి చేసుకుంటారో లేదో

    పెళ్లి చేసుకుంటారో లేదో

    వారిద్దరి పెళ్లి గురించి కూడా జాకీ ష్రాఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ అమ్మాయి ఆర్మీ కుటుంబం నుంచి వచ్చింది. కాబట్టి ఆమెకు క్రమశిక్షణగా ఎలా ఉండాలో తెలుసు అనుకుంటున్నా అంటూ దిశా పటాని గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వారిద్దరికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు. జీవితాంతం స్నేహితులుగానే ఉంటారో పెళ్లి చేసుకుంటారో ఎదురుచూడాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

     మంచి స్నేహితులం

    మంచి స్నేహితులం

    దర్శకుడు అహ్మద్ ఖాన్ తెరకెక్కించిన బాగి 2 చిత్రంలో టైగర్ ష్రాఫ్, దిశా పటాని కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలసి నటించిన ఏకైక చిత్రం ఇదే. టైగర్ ష్రాఫ్ తన ప్రేమ గురించి ఇంతవరకు స్పదించలేదు. కానీ దిశా పటానికి మాత్రం మీడియా నుంచి పలుమార్లు ఈ ప్రశ్న ఎదురైంది. టైగర్ ష్రాఫ్ ని త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై దిశా పటాని స్పందించింది. నా దృష్టి మొత్తం కెరీర్ పైనే. టైగర్ ష్రాఫ్, నేను మంచి స్నేహితులం. అంతకు మించి ఇప్పుడు నేనేం మాట్లాడలేను అని దిశాపటాని వివరించింది.

     రెండు చిత్రాల్లో

    రెండు చిత్రాల్లో

    ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. పునీత్ మల్హోత్రా దర్శత్వంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో, సిద్దార్థ్ ఆనంద్ దర్శత్వంలో మరో చిత్రంలో టైగర్ ష్రాఫ్ నటిస్తున్నాడు. డాన్సులు అద్భుతంగా చేసే కొద్దిమంది బాలీవుడ్ హీరోల్లో టైగర్ ఒకడు. యాక్షన్ సన్నివేశాల్లో రిస్క్ తో కూడుకున్న స్టంట్స్ చేయడానికి కూడా టైగర్ ఇష్టపడతాడు.

    English summary
    Jackie Shroff opens up about Tiger Shroff and Disha Patani's wedding
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X