250 కోట్ల అప్పుల ఊబిలో రకుల్ భర్త.. పెళ్లి తర్వాత ఊహించని కష్టాలు

ఇటీవలే పెళ్లి చేసుకున్న సౌత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నాని వందల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పని చేసినందుకు జీతం చెల్లిందలేదంటూ జాకీ ప్రొడక్షన్ హౌజ్ లో పని చేసిన వ్యక్తులు సోషల్ మీడియాకెక్కారు. ఇక కొత్త పెళ్లి కూతురు రకుల్ కు ఎఏ విషయం తెలిసి షాక్ అయ్యిందనే రూమర్ మరోవైపు చక్కర్లు కొడుతోంది. మరి జాకీ ఈ అప్పులను తీర్చడానికి ఏం చేశాడు అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 21న బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకున్నారు . హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాతగా మారిన జాకీ భగ్నానీని ప్రేమించి, పెళ్ళాడిన రకుల్ ప్రీత్ సింగ్ జీవితం ఇక సెటిల్ అయినట్టేనని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది. రకుల్ భర్తపై 250 కోట్ల అప్పుల భారం పడింది. జాకీ భగ్నానీ తన ఆస్తిని అమ్మేసినట్టు సమాచారం.

Jackky Bhagnani s production house Pooja Entertainment s Mumbai office sold to pay off 250 crore debt

జాకీ భగ్నానీకి 'పూజా ఎంటర్‌టైన్‌మెంట్' అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ సంస్థ నిర్మించిన సినిమాలన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ ఏడాది తెరకెక్కిన 'బడే మియా చోటే మియా' సినిమాలో కూడా ఈ సంస్థ పెట్టుబడి పెట్టింది. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. దాంతో నిర్మాత పరిస్థితి మరింత దిగజారింది.

జాకీ భగ్నానీ తన సంస్థలో పని చేస్తున్న చాలా మంది ఉద్యోగులకు చాలా నెలలుగా జీతం చెల్లించలేదు. పైగా వడ్డీలతో కలిపి వాళ్ళ అప్పులు మొత్తం 250 కోట్ల రూపాయలకు చేరాయని తెలుస్తోంది. అందుకే ఆ అప్పులను తీర్చడానికి పూజా ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫీస్ ఉన్న భవనాన్ని అమ్మేశాడు. 7 అంతస్తులతో ఉన్న ఈ బిల్డింగ్ ను ఓ బిల్డర్ కొన్నారని, భవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో అపార్ట్ మెంట్ నిర్మిస్తారని అంటున్నారు.

Jackky Bhagnani s production house Pooja Entertainment s Mumbai office sold to pay off 250 crore debt

'పూజా ఎంటర్‌టైన్‌మెంట్' భారీ నష్టాలను చవిచూడడంతో 80 శాతం మంది కార్మికులను ఇంటికి పంపించారు. దాదాపుగా ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని చెబుతున్నారు. కాబట్టి కొంతమంది కోపంగా ఉన్న వ్యక్తులు ఈ సంస్థ, నిర్మాతలు జాకీ భగ్నాని, వాషు భగ్నానిపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగా నటి రకుల్ ప్రీత్ సింగ్ జీవితం పెళ్ళయిన కొత్తలోనే కష్టాల్లో పడింది.

భగ్నాని తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సుమారు 2 సంవత్సరాల పోరాటం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అంతకుముందు 2021లో వచ్చిన కరోనా కాలంలో పూజా ప్రొడక్షన్ కంపెనీ విడుదల చేసిన బెల్ బాటమ్, తరువాత మిషన్ రాణిగంజ్, గణపత్ మొదలైనవి ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు మొదలైన అప్పుల బాధ ఇప్పుడు తమ ఆస్తులను అమ్ముకునే దాకా తీసుకొచ్చింది. ఈ విషయం తెలిసిన రకుల్ ఫ్యాన్స్ పాపం రకుల్.. పెళ్ళయి ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే ఇంత కష్టాల్లో పడింది అంటున్నారు. ఈ కష్టాలు శాశ్వతం కాదంటూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X