twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోసగాడితో 'ఆ' రిలేషన్, ఈడీ ముందుకు జాక్వెలిన్.. ఐదు గంటలు, 50 ప్రశ్నలు... మాములుగా లేదుగా!

    |

    200 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడిన సుఖేష్ చంద్రశేఖర్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చేరుకున్నారు. ఈ అంశంపై ఆమెను ఈరోజు ప్రశ్నించనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    జాక్వెలిన్‌ కోసం సుకేష్ నీళ్లలాగా

    జాక్వెలిన్‌ కోసం సుకేష్ నీళ్లలాగా

    ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో జాక్వెలిన్‌ కోసం సుకేష్ నీళ్లలాగా డబ్బు ఖర్చు చేసినట్లు స్పష్టంగా పేర్కొంది. ఆభరణాల నుండి క్రాకరీ దాకా, దిగుమతి చేసుకున్న పెంపుడు జంతువుల లాంటివి కూడా జాక్వెలిన్‌కు బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు సుకేష్‌తో ఉన్న ఈ సాన్నిహిత్యం జాక్వెలిన్‌కు మెడకు చుట్టుకుంది.

    50 ప్రశ్నలు

    50 ప్రశ్నలు

    సుఖేష్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీలాండరింగ్ నిరోధక కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 50 ప్రశ్నలు ఎదుర్కోనున్నారు. సాక్షిగా జాక్వెలిన్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. విశేషమేమిటంటే, జాక్వెలిన్ మరియు ఆమె క్లయింట్ శృంగార సంబంధంలో ఉన్నారని సుకేష్ లాయర్ అనంత్ మాలిక్ పేర్కొన్నారు. అయితే, ఈ వాదనను జాక్వెలిన్ ప్రతినిధి స్పష్టంగా ఖండించారు.

    ఐదు గంటలకు పైగా

    ఐదు గంటలకు పైగా

    ఆమె బుధవారం ఈడీ ఎదుట హాజరు కానుంది . సెంట్రల్ ఢిల్లీలోని MTNL కార్యాలయంలో ED అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. ఇంటరాగేషన్ ఐదు గంటలకు పైగా సాగుతుందని అంటున్నారు. ఇక ఈడీ అభ్యర్థన మేరకు ఆమెకు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆమె దేశం విడిచి పారిపోవచ్చని ఏజెన్సీ అనుమానం వ్యక్తం చేసింది, అందుకే సంబంధిత అధికారులకు లేఖ రాసింది. దీంతో ఆదివారం సాయంత్రం ఢిల్లీకి, అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్లేందుకు బయలుదేరిన ఆమెను ముంబై విమానాశ్రయంలో అడ్డుకున్నారు.

    52 లక్షల విలువైన గుర్రాన్ని

    52 లక్షల విలువైన గుర్రాన్ని

    ఈడీ వర్గాల ప్రకారం, జాక్వెలిన్ మరియు సుకేష్ మధ్య సంభాషణ జనవరిలో ప్రారంభమైంది. తీహార్ జైలులో ఉన్నప్పుడు కూడా ఇద్దరూ మాట్లాడుకునేవారట. మనీలాండరింగ్ కింద కేసుకు సంబంధించి ఈడీ జాక్వెలిన్ సహా అనేక మంది పేర్లు ఉన్న 7వేల పేజీల చార్జిషీట్ ను కోర్టుకు దాఖలు చేసింది.

    జాక్వెలిన్‌కు సుకేష్ చంద్రశేఖర్ రూ.10 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్లు చార్జిషీట్‌లో తేలింది. ఇందులో నాలుగు పెర్షియన్ పిల్లులు ఉన్నాయి. వీటిలో ఒక పిల్లి ధర 9 లక్షల రూపాయలు. దీంతో పాటు రూ.52 లక్షల విలువైన గుర్రాన్ని కూడా బహుమతిగా ఇచ్చారని తేలింది.

    వ్యక్తిగత సంబంధం లేదని

    వ్యక్తిగత సంబంధం లేదని

    ఛార్జిషీట్‌లో నటి నోరా ఫతేహి పేరు కూడా ఉంది. సుకేష్ చంద్రశేఖర్ నోరా ఫతేహికి కోటి రూపాయల విలువైన బిఎమ్‌డబ్ల్యూ కారు మరియు ఐఫోన్‌ను బహుమతిగా ఇచ్చాడు. అయితే సుకేష్‌తో నోరాకు వ్యక్తిగత సంబంధం లేదని ఆమె చెబుతోంది. ప్రస్తుతం సుకేష్ తీహార్ జైలులో ఉన్నాడు. ఈ అంశంపై తదుపరి విచారణ డిసెంబర్ 13న జరగనుంది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ వంటి ప్రముఖులను మోసం చేసినట్లు చంద్రశేఖర్‌పై ఆరోపణలు ఉన్నాయి.

    Recommended Video

    PSPK 27 : Nidhhi Agerwal To Star Opposite Pawan Kalyan In Periodic Drama
     చార్టర్డ్ ఫ్లైట్‌ బుక్ చేసి

    చార్టర్డ్ ఫ్లైట్‌ బుక్ చేసి

    బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు ముంబై నుంచి చెన్నైకి జాక్వెలిన్ కోసం చార్టర్డ్ ఫ్లైట్‌ను కూడా సుకేష్ బుక్ చేసినట్లు సోర్సెస్ తెలిపాయి. ఓ వ్యాపారి భార్య నుంచి సుకేష్ వసూలు చేసిన భారీ మొత్తంలో నిధులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మళ్లించినట్లు కూడా ఈడీ అనుమానిస్తోంది. అయితే, జాక్వెలిన్ తాను బాధితురాలినని చెబుతూ ఇన్వెస్టిగేషన్ కు సహకరిస్తోంది.

    English summary
    Jacqueline Fernandez appears before ED in Rs-200 crore money laundering case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X