For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jacqueline Fernandez‌ కు 52 లక్షల గుర్రం, 9 లక్షల పిల్లి గిఫ్గుగా.. ఆర్థిక నేరస్థుడితో డేటింగ్.. ఈడీకి చిక్కి

  |

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. మాఫియా వ్యవహారాలతో ఆర్థిక అక్రమాలకు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన సుఖేష్ చంద్రశేఖర్‌తో రిలేషన్‌షిప్ వ్యవహారం ఆమెను తీవ్రమైన సమస్యల్లో పడేసింది. కోట్లాది రూపాయలు ఆమెకు బహుమతిగా ఇవ్వడం ఈడీ అధికారులు ఇప్పటికే రెండుసార్లు ఆమెను విచారించారు. అయితే తాజాగా సుఖేష్‌కు సంబంధించిన అక్రమ, అవినీతి లావాదేవీల గురించి కొన్ని ఆధారాలు బయటపడటంతో దేశం విడిచి పారిపోకుండా ఆమెకు దేశవ్యాప్తంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా జాక్వలైన్, సుఖేష్‌కు సంబంధించిన వ్యవహారాలు అధికారులకు ముచ్చటమటలు పట్టించాయి. ఈ వివరాల్లోకి వెళితే.

   ఆర్థిక నేరాలతో సుఖేష్ చంద్రశేఖర్

  ఆర్థిక నేరాలతో సుఖేష్ చంద్రశేఖర్

  అనేక ఆర్థిక నేరాలతో సంబంధాలు ఉన్న తమిళనాడుకు చెందిన సుఖేష్ చంద్రశేఖర్‌ను తీహార్ జైలు నుంచి అవినీతి లావాదేవీలు నడిపించాడు. దాదాపు రూ.200కుపైగా బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు అనే విషయం రాన్ బ్యాక్స్ ప్రమోటర్ శివేందర్ సింగ్ భార్య అదితి సింగ్ చేసిన ఫిర్యాదుతో సుఖేష్ డొంక బయటపడింది. సుఖేష్ బెదిరింపుల నేపథ్యంతో పలు మార్లు ఆమె రూ.150 కోట్లు చెల్లించినట్టు బయటపడింది.

  జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు తీహార్ జైలు నుంచి ఫోన్

  జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు తీహార్ జైలు నుంచి ఫోన్

  అయితే ఆర్థిక నేరాల్లో కరుడు గట్టిన నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్‌ బాలీవుడ్ తారలు జాక్వలైన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహితో రిలేషన్‌షిప్ వ్యవహారం అధికారులు దృష్టికి వచ్చింది. తీహార్ జైలు నుంచి జాక్వలైన్‌ ఫెర్నాండేజ్, నోరా ఫతేహితో పలుమార్లు సుఖేష్ ఫోన్‌లో సంభాషించినట్టు కాల్ డేటా స్పష్టం చేసింది. దాంతో వారిని విచారించగా, జాక్వలైన్‌కు వందల కోట్ల బహుమతులు, లక్షలు విలువ చేసే విలాసవంతమైన కారును నోరా ఫతేహికి ఇచ్చినట్టు ఆధారాలు లభించాయి.

   52 లక్షల విలువైన అరబిక్ గుర్రం

  52 లక్షల విలువైన అరబిక్ గుర్రం

  తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలో జాక్వలైన్‌కు వందల కోట్ల రూపాయలతో ఇంటిని, బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చారని, అలాగే 52 లక్షలు విలువ చేసే మేలుజాతి అరబిక్ గుర్రాన్ని కూడా గిఫ్టుగా ఇచ్చారు. అంతేకాకుండా 9 లక్షలు విలువ చేసే ఫర్షియా పిల్లిని కూడా బహుమతిగా అందించారు అనే విషయాలు విచారణలో బయటపడ్డాయి.

  జాక్వలైన్‌కు లుకౌట్ నోటీసులు

  జాక్వలైన్‌కు లుకౌట్ నోటీసులు

  ఇదిలా ఉండగా, భారీగా డబ్బు లంచంగా ఇచ్చి తీహార్ జైలు నుంచి బెయిల్ పొందాడు. ఆ తర్వాత చెన్నైలో ఉండగా ప్రైవేట్ విమానంలో సుఖేష్‌ను కలువడానికి జాక్వలైన్ వెళ్లిందనే విషయం కూడా ఈడీ విచారణ సందర్భంగా బయటకు వచ్చింది. ఇలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న జాక్వలైన్‌‌కు ఈడీ అధికారుల మరోసారి సమన్లు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లకుండా ఆమెకు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అయితే డిసెంబర్ 6వ తేదీ దుబాయ్‌కు వెళ్తుండగా ఆమెను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకొన్నారు. ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయటకు పంపించారు.

  డిసెంబర్ 8వ తేదీన ప్రశ్నించనున్న ఈడీ

  డిసెంబర్ 8వ తేదీన ప్రశ్నించనున్న ఈడీ

  సుఖేష్ చంద్రశేఖర్‌తో లింకు ఉన్న 200 కోట్ల మేర ఆర్థిక కుంభకోణంలో జాక్వలైన్‌ను మరోసారి విచారించేందుకు ఈడీ అధికారులు సిద్దమయ్యారు. ఈ కేసులో మరిన్ని విషయాలు రాబట్టడానికి ఆమెను డిసెంబర్ 8వ తేదీన విచారించాలని ఆమెకు సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆమెను అడ్డుకొన్నారు.

  Recommended Video

  Varudu Kavalenu Movie Team Interview
  సల్మాన్ ఖాన్ డీ బ్యాంగ్ షోకు వెళ్తుండగా..

  సల్మాన్ ఖాన్ డీ బ్యాంగ్ షోకు వెళ్తుండగా..

  ఇదిలా ఉండగా, జాక్వలైన్ ఫెర్నాండేజ్ దుబాయ్‌లో సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న డీ బ్యాంగ్ టూర్‌లో భాగస్వామ్యం కావాల్సి ఉంది. దుబాయ్‌కి వెళ్లకుండా జాక్వలైన్‌ను అడ్డుకోవడంతో ఆమె స్థానంలో హీరోయిన్, కొరియోగ్రాఫర్ డైసీ షాను తీసుకొన్నారు. ఈ డ్యాన్స్ షోలో ఆయుష్ శర్మ, ప్రభుదేవా, సునీల్ గ్రోవర్, సాయి మంజ్రేకర్, కమల్ ఖాన్, శిల్పాశెట్టి పాల్గొంటున్నారు.

  English summary
  Bollywood actress Jacqueline Fernandez‌ get 52 lakhs Arabic horse and Rs 9 Lakhs Persian cat from Sukhesh Chandrashekhar who is facing 200 crores extortion case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X