లంకసుందరి కిట్టీ బ్యాగు... 3 లకారాలు మాత్రమే...
శ్రీలంక నుంచి వచ్చి బాలీవుడ్ లో పాగా వేసిన బ్యూటీ క్వీన్ జాక్విలిన్ ఫెర్నాండేజ్, నటనకన్నా, స్టైల్స్ సెన్స్ తోనే ఫేమస్ అయింది. అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ ఉన్న జాకీ, తన లుక్స్ పై అసలు కాంప్రమైజ్ కాదు. అమ్మడు ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాల్సిందే. ఏ సినీ ఈవెంట్ లోనైనా మెరిస్తే, కెమెరాలన్నీ ఒకేసారి క్లిక్ మనాల్సిందే.
సాధారణంగా సెలబ్రిటీల స్టైల్ స్టేట్మెంట్ ను తు.చ. తప్పకుండా ఫాలో అయిపోతుంటారు అమ్మాయిలు. కానీ, జాకీ సైల్ ను కాపీ కొట్టడం అంత తేలిక కాదు. ఎందుకంటే అమ్మడి రేంజే వేరు మరి. ముఖ్యంగా అమ్మడి స్టైల్ స్టేట్మెంట్ లో కీలక పాత్ర పోషించేది ఆమె కిట్టీ బ్యాగులే. ఇక వాటిని కొనుక్కోవాలంటే, మధ్యతరగతి వాళ్లు ఆస్థులు అమ్ముకోవాల్సిందే.

సాధారణగా జాక్విలిన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ లకే ప్రాధాన్యం ఇస్తుంది. అమ్మడి బ్యాగుల కలెక్షన్ లో వీటిదే ప్రథమ స్థానం అని చెప్పుకోవచ్చు. ఇక లాక్ డౌన్ కు ముందు ఓ ఈవెంట్ లో తళుక్కుమన్న జాకీ, తన డ్రెస్ కు మ్యాచ్ అయ్యే విధంగా ఓ బుజ్జి బ్యాగును తగిలించుకుని వచ్చింది. అయితే, ఆ బుజ్జిముండ చూడటానికి ఇంతే ఉన్నా, ఖరీదు మాత్రం లకారాల్లోనే ఉండటంతో ఫ్యాషన్ పండితులే నోరెళ్లబట్టాల్సి వచ్చింది.
ఇంతకూ అమ్మడు ధరించిన మెటాలిక్ డియార్ బ్యాగ్ ధర ఎంతంటారా... అక్షరాలా 3900 డాలర్లు. అంటే, రెండు లక్షల 8వేల ఆరొందలన్నమాట. ఈ మాట వింటే సాధారణ జనాలకు కళ్లు బైర్లుకమ్మినంత పని అవుతుంది గానీ, కాస్ట్లీ బ్యాగులంటే పడి చచ్చేవారికి అదొక లెక్కే కాదు మరి. ఏమైనా, ఇదొక్కటే అనుకుంటే పొరపాటే, ఎందుకంటే... జాకీ వాడ్రోబ్ నిండా ఇలాంటి కిట్టీ బ్యూగులు ఎన్ని ఉన్నాయో లెక్కేలేదట.!


Click it and Unblock the Notifications











