జగపతిబాబు బాలీవుడ్ ఎంట్రీ.. తానాజీ‌లో పవర్‌ఫుల్ పాత్ర.. భారీగా రెమ్యునరేషన్!

By Rajababu

Recommended Video

Jagapathi Babu Stepped Into Bollywood

విలక్షణ నటుడు జగపతిబాబు ఇటీవల కాలంలో హీరో వేషాలు మానేసి విలన్‌గా అదరగొడుతున్నాడనే విషయం తెలిసిందే. లెజెండ్ చిత్రంతో నటుడిగా రూపు మార్చుకొన్న జగ్గుభాయ్ పరభాషా చిత్రాలపై కూడా దృష్టిపెట్టారు. తాజాగా బాలీవుడ్‌లో జగపతిబాబు తన కెరీర్ ప్రారంభించారు. ఈ చిత్రానికి భారీ రేంజ్‌లో రెమ్యునరేషన్ కూడా అందుకొన్నట్టు సమాచారం.

అజయ్ దేవగణ్‌తో కలిసి జగపతిబాబు

అజయ్ దేవగణ్‌తో కలిసి జగపతిబాబు

బాలీవుడ్‌లో తానాజీ అనే హిందీ చిత్రంతో జగపతి ఎంట్రీ ఇచ్చాడు. యుద్ధ నేపథ్యంగా రూపొందే ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్‌తో కలసి ఓ కీలక పాత్రలో జగ్గుభాయ్ కనిపించడం విశేషం.

చత్రపతి శివాజీగా జగ్గుభాయ్

చత్రపతి శివాజీగా జగ్గుభాయ్

మరాఠా వంశస్తుడు, చక్రవర్తి చత్రపతి శివాజీగా జగపతి బాబు నటిస్తున్నారనేది తాజా సమాచారం. ఈ చిత్రం కోసం జగపతిబాబు భారీగా రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు తెలిసింది. అజయ్ దేవగణ్ సుబేదార్ తానాజీ మలుసారే‌ పాత్రలో కనిపించనున్నారు.

బాలీవుడ్‌లో భారీ ఆఫర్లు

బాలీవుడ్‌లో భారీ ఆఫర్లు

తానాజీ ఆఫర్‌ను అంగీకరించడంతో బాలీవుడ్‌లో మరిన్నీ అవకాశాలు జగపతి బాబు తలుపు తడుతున్నట్టు తెలిస్తుంది. పలు నిర్మాణ సంస్థలు కొన్ని పాత్రలను ఆయన ముందుకు తెచ్చినట్టు సమాచారం. అయితే ఆ ఆఫర్లపై ఆచీతూచీ వ్యవహరిస్తున్నట్టు తెలిసింది.

జగపతిబాబు ఎంట్రీ గురించి ట్వీట్

తానాజీ చిత్ర షూటింగ్‌లో జగపతిబాబు జాయిన్ అయ్యారు. అజయ్ దేవగణ్ నటించి, రూపొందించే భారీ బడ్జెట్‌ చిత్రం తానాజీలో ఆయన భాగస్వామి అయ్యారు. జగపతిబాబు నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి అని సినీ విమర్శకుడు రోహిత్ జైస్వాల్ ట్వీట్ చేశారు.

నిర్మాతగా అజయ్‌దేవగణ్

నిర్మాతగా అజయ్‌దేవగణ్

మరాఠా సామ్రాజ్యం, చత్రపతి శివాజీ కథా నేపథ్యంతో తెరకెక్కె ఈ చిత్రానికి దర్శకుడిగా ఓం రావత్ వ్యవహరించానున్నారు. ఈ చిత్రాన్ని వాయాకామ్ 18 మోషన్ పిక్చర్స్‌తో కలిసి అజయ్ దేవగణ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో తానాజీ భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్నది.

9 ఏళ్ల తర్వాత కాజోల్, అజయ్ కలిసి

9 ఏళ్ల తర్వాత కాజోల్, అజయ్ కలిసి

చారిత్రాత్మక నేపథ్యంగా రూపొందుతున్న తానాజీ చిత్రంలో తన భార్య కాజోల్‌తో కలిసి అజయ్ దేవగణ్ నటించడం విశేషం. తొమ్మిదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర వివరాలను సినిమా యూనిట్ ప్రకటించనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X