తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకంటూ... అరుదైన ఫోటో పోస్టు చేసిన జాహ్నవి!

By Bojja Kumar

Recommended Video

Janhvi Tweets About Actress Sridevi

ఇండియన్ సినిమా రంగంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి జాహ్నవి, ఖుషీ పుట్టిన తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 15 సంవత్సరాల పాటు తన ఇద్దరు కూతుర్లే ప్రపంచంగా బ్రతికింది. అద్భుతమైన కెరీర్ ఉన్నా పిల్లల కోసం త్యాగం చేసింది.

ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అతిలోక సుందరి మళ్లీ నటిగా తన సత్తా చాటుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా మృత్యువు ఓడిలోకి వెళ్లిపోయి అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. నేడు శ్రీదేవి 55వ జయంతి. ఆమె మరణం తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజు ఇది. ఈ సందర్భంగా అభిమానులు తమ ఆరాధ్య దేవతను తలుచుకుంటున్నారు.

Janhvi Instagram Post on Sridevi’s Birth Anniversary

శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తల్లి పుట్టినరోజు సందర్భంగా ఓ అరుదైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అమ్మానాన్నలతో కలిసి ఉన్న ఈ మధుర జ్ఞాపకంతో జాహ్నవి మళ్లీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది. శ్రీదేవి ఉండి ఉంటే ఈ రోజు పెద్ద వేడుక జరిగేది. కానీ విధి ఆడిన వింత నాటకంలో సంతోషాలు పరవళ్లు తొక్కాల్సిన ఈ రోజున కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆమె జ్ఞాపకాలతో విషాదంలో ఉండిపోవాల్సి వచ్చింది.

అంతకు ముందు జాహ్నవి ఓ ఇంటర్వ్యూలో తల్లి గురించి మాట్లాడుతూ... తన జీవితంలో అమ్మ ది బెస్ట్. అమ్మ ఇచ్చిన ఇన్స్‌స్పిరేషన్‌తో మరింత ధైర్యంగా ముందుకకు సాగుతున్నాను. అమ్మను తలుచుకోకుండా ఏ పని చేయను అన్నారు.

మరో వైపు శ్రీదేవి తొలి జయంతిని పురస్కరించుకుని ముంబైలోని చాపెల్ రోడ్డులో ఓ బిల్డింగుపై 18 అడుగుల భారీ పెయింట్ వేశారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ... శ్రీదేవిని అనుక్షణం తలుచుకుంటూనే ఉన్నాం. మా జ్ఞాపకాల్లో ఆమె జీవించే ఉంది. లెజెండ్స్‌కు మరణం లేదు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X