ఆయనతో కలిసి పనిచేయడం మర్చిపోలేని విషయం.. వాటి వల్ల చెమటలు పట్టేవి
అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవీ.. ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది జాన్వీ. ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. సోషల్ మీడియాలో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. నిత్యం తన అందాలను ఆరబోసే ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు కిక్కిస్తూ ఉంటుంది.

వెబ్ సిరీస్‌లతో బిజీ..
ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా పెరిగిన నేపథ్యంలో బడా స్టార్లు సైతం వాటిపై దృష్టి పెడుతున్నారు. ఎలాంటి సెన్సార్ సమస్యలు లేకపోవడం, హద్దుల్లేని శృంగారాన్ని చూపించడంలాంటి ఎన్నో వెసులు బాట్లు అందులో ఉన్నాయి. వెబ్ సిరీస్‌లో కంటెంట్ సైతం బలమైన కంటెంట్ ఉండటంతో అవి చాలా క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ సైతం‘ఘోస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది.

మీడియాతో ముచ్చట్లు..
జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌లో జాన్వీ కపూర్ నర్స్‌గా కనిపించనుంది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తాజాగా జాన్వీ విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. ‘ఘోస్ట్ స్టోరీస్'లో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా నర్స్ కాస్ట్యూమ్స్ వల్ల చిరాకుకు గురైనట్లు తెలిపింది.

చెమటలు పట్టేవి..
ఘోస్ట్ స్టోరీస్‌లో తాను కూడా ఓ పార్ట్ కావడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. నర్స్ పాత్రలో నటించడం చాలా తేలికగా ఉన్నప్పటికీ ఆ డ్రెస్, కాస్ట్యూమ్స్ వల్ల చెమటలు పట్టేసి సెట్‌లో చాలా చిరాకుగా అనిపించేదని తెలిపింది. మరోపక్క నర్స్ పాత్రలో తనను తాను చూసుకోవడం ఎంతో సంతోషంగా అనిపించిందని పేర్కొంది. ఇప్పటి వరకూ తాను ఇలాంటి పాత్రను పోషించలేదని తెలిపింది.

ఆమె సాయంతో..
జోయా వల్ల తన పాత్ర గురించి మరింత అవగాహన వచ్చిందని తెలిపింది. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేని విషయమని చెప్పుకొచ్చింది. ఘోస్ట్‌స్టోరీస్‌లో తన పాత్ర కోసం ఓ నర్స్ తనకెంతో సాయం చేసిందని తెలిపింది. నర్స్ పాత్రలోని హావభావాలను తాను నేర్చుకోవడం చూసి ఆమె ఎంతో సంతోషించిందని పేర్కొంది. తనలో ఓ గొప్ప నర్స్ ఉందని ఆమె తనతో చెప్పిందని జాన్వీ తెలిపింది.


Click it and Unblock the Notifications











