జాహ్నవితో జతకడుతున్న ఎంసీఏ విలన్.. భలే ఛాన్స్ కొట్టేశాడే..
బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టించేందుకు బాలీవుడ్ దర్శకులు కరణ్ జోహర్, జోయా అఖ్తర్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్ సిద్ధమవుతున్నారు. గోస్ట్ స్టోరీస్ అనే పేరుతో షార్ట్ ఫిలింస్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఇటీవల ప్రకటన చేయడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఇప్పటికే జోయా అఖ్తర్ గోస్ట్ స్టోరీస్ షార్ట్ ఫిలింను సెట్స్‌పైకి తీసుకెళ్లారు.
తన గోస్ట్ స్టోరీస్ సినిమా షూటింగ్ ప్రారంభమైందని ట్వీట్ చేశారు. గోస్ట్ స్టోరీస్ నా ఏడో సినిమా. నాకు ష్టార్ ఫిలింస్ అంటే చాలా ఇష్టం. ఈ ఫిలిం కోసం జాహ్నవి కపూర్, విజయ్ వర్మ జత కడుతున్నారు అంటూ క్లాప్ బోర్డను ఇన్స్‌టాగ్రామ్‌లో జోయా షేర్ చేశారు.

అయితే విజయ్ వర్మ ఎవరా అనే ప్రేక్షకులు ఆరా తీయగా.. అతను ఇటీవల దిల్ రాజు నిర్మించిన ఎంసీఏ సినిమాలో విలన్‌గా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. సాయిపల్లవి, నాని నటించిన ఈ సినిమాలో ప్రధాన విలన్‌గా కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల విజయం సాధించిన గల్లీబాయ్ సినిమాలో కూడా విజయ్ వర్మ నటించారు.
ఘోస్ట్ స్టోరీస్ ఫిలింను యూరీ: ది సర్జికల్ స్ట్రయిక్ సినిమాను ఆర్ఎస్‌వీపీ బ్యానర్‌పై రొనీ స్క్రీవాలా రూపొందించనున్నారు. ఈ సినిమాలో నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యం కావడం విశేషం. గతంలో వికీ కౌశల్ నటించిన లవ్ పర్ స్క్వేర్ ఫుట్ అనే సినిమాకు నెట్ ఫ్లిక్స్ నిర్మాణ భాగస్వామ్యాన్ని అందించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











