Vijay Deverakonda సినిమాపై శ్రీదేవి కూతురు క్లారిటీ.. రూమర్లకు చెక్ పెట్టిన జాన్వీ కపూర్
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న కొంతమంది అగ్ర హీరోయిన్స్ టాలీవుడ్ హీరోలతో కూడా నటించాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం మిస్ చేసుకోవడం లేదు. ఇప్పటికే కొంత మంది బాలీవుడ్ బ్యూటీలు ఒకవైపు బాలీవుడ్ చిత్రాలను మరొకవైపు టాలీవుడ్ చిత్రాలను సమానంగా చేసుకుంటూ వెళుతున్నారు. అంతే కాకుండా పారితోషికం విషయంలో కూడా ఒకే తరహాలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ కూడా బాలీవుడ్ మార్కెట్ కు తీసిపోని విధంగా కొనసాగుతోంది. అందుకే మన నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్స్ కు అడిగినంత పారితోషికం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇక జాన్వికపూర్ కూడా తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.
పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో జాన్వికపూర్ కూడా మేయిన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు చాలా వార్తలు వచ్చాయి. ఇదివరకే జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండతో నటించాలని ఉన్నట్లుగా తన మనసులోని మాటను వివరించిన విషయం తెలిసిందే. అవకాశం వస్తే తప్పకుండా అతనితో నటిస్తానని కూడా చాలా ఇంటర్వ్యూలలో ఓపెన్ గానే చెప్పేసింది. ఇక ఈ బ్యూటీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనగణమన అనే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ అయితే వచ్చింది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో జాన్వీ కపూర్ ఆ వార్తలపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఊహాగానాలను ఎవరు నమ్మవద్దు. నేను ఇంకా ఏ తెలుగు సినిమాను అలాగే ఏ తమిళ సినిమాను కూడా ఓకే చేయలేదు.. నేను ఏదైనా సినిమాకు సంతకం చేస్తే అధికారికంగా చెబుతాను.. లేదంటే ప్రొడక్షన్ హౌస్ ద్వారా అయినా అధికారికంగా తెలియజేయబడుతుంది.. అంటూ జాన్వి కపూర్ జనగణమన ప్రాజెక్టును ఇంకా ఓకే చేయలేదు అని అధికారికంగా వివరణ ఇచ్చింది. నిన్నటి వరకు విజయ్ దేవరకొండ జాన్వికపూర్ ఫిక్సైనట్లు సోషల్ మీడియాలో అభిమానుల వివిధ రకాల ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు.
విజయ్ దేవరకొండ జాన్వీ మధ్యలో కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అవుతుంది అని కూడా చాలామంది పాజిటివ్గా స్పందించారు. దీంతో జనగణమన ప్రాజెక్టుపై ఒక్కసారిగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక జాన్వీ నటించడం లేదని చెప్పడంతో ఓ వర్గం ఆడియెన్స్ నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమాను పూర్తిచేశారు. ఇక ఆ సినిమా తర్వాత చేస్తున్న జనగనమన ప్రాజెక్టు కూడా అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని ప్రేక్షకులలో గట్టి నమ్మకం ఏర్పడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వికపూర్ నటించడం లేదు అని ప్రస్తుతానికి క్లారిటీ వచ్చేసింది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. ఈ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











