For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘వోగ్’ ఫోటోలతో అల్లాడిస్తున్న జాహ్నవి, శ్రీదేవిని మించేలా...

  By Bojja Kumar
  |

  భారతీయ సినీ పరిశ్రమలో ఒకప్పుడు శ్రీదేవి తన అందంతో సృష్టించిన అలజడి అంత ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది కుర్రాళ్లు ఆమె గ్లామర్‌ మత్తులో కొట్టుమిట్టాడారు. రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్లు సైతం ఈ లిస్టులో ఉన్నవారే. శ్రీదేవి శకం ముగిసి ఎంతో మంది కొత్త భామలు ఇండస్ట్రీకి వచ్చినా గ్లామర్ పరంగా శ్రీదేవి స్థాయి గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యారని చెప్పక తప్పదు. త్వరలో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆమె వేసి తొలి గ్లామర్ స్టెప్ వోగ్ మేగజైన్ ఫోటో షూట్.

  మరిన్ని ఫోటోలు విడుదల చేసిన వోగ్

  ‘వోగ్' మేగజైన్ జూన్ సంచిన కవర్ పేజీ కోసం జాహ్నవి కపూర్ ప్రత్యేకంగా ఫోటో షూట్లో పాల్గొన్నారు. నాలుగు రోజుల క్రితం వోగ్ సంస్థ కొన్ని ఫోటోలు విడుదల చేయగా, తాజాగా మరిన్ని ఫోటోలను విడుదల చేసింది.

  గ్లామర్ పరంగా జాహ్నవి సెన్సేషన్

  తొలి ప్రయత్నంలోనే జాహ్నవి గ్లామర్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. మున్ముందు ఆమె ఈ గ్లామర్ ఇండస్ట్రీని రూల్ చేయడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది.

  సెక్స్ అప్పీల్ సూపర్

  జాహ్నవిలో ఆకట్టుకునే అందం మాత్రమే కాదు... యువతను కట్టిపడేసే సెక్సీ అప్పీల్ అద్భుతంగా ఉందని, సినిమా రంగంలో నటిగా రాణించాలంటే ఇది ఎంతో ముఖ్యమని, జాహ్నవికి మంచి భవిష్యత్ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

  వోగ్ ఎఫెక్టుతో మరింత పాపులర్

  వోగ్ ఫోటోషూట్ తర్వాత జాహ్నవి పాపులారిటీ మరింత పెరిగింది. ఇంటర్నెట్లో ఆమె వోగ్ ఫోటో షూట్ కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు వెతుకుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోస్ వైరల్ అయ్యాయి.

  సినిమా విడుదల ముందే జాహ్నవి గుర్తింపు

  జాహ్నవి త్వరలో ‘ధడక్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల ముందే ‘వోగ్' ఫోటో షూట్ ద్వారా జాహ్నవి అందం పరంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరి నటన పరంగా ఆమెలో టాలెంట్ ఏమిటనేది సినిమా విడుదల తర్వాతగానీ చెప్పలేం.

  సినిమాల విషయంలో అమ్మ చెప్పిన సూత్రాన్ని పాటిస్తా

  ఏ సినిమాలో చేస్తున్నాం? ఎలాంటి పాత్రను ఎంచుకున్నాం? అన్నది ముఖ్యం కాదు. మనం ఇచ్చిన ప్రదర్శనతో ఇతరులను మెప్పించామా? లేదా? అన్నదే ముఖ్యమని అమ్మ చెప్పింది. ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ కెరీర్లో ముందుకు సాగుతాను అని జాహ్నవి తెలిపారు.

  ధడక్ మూవీ

  జాహ్నవి నటిస్తున్న తొలి చిత్రం ‘దఢక్' జులై 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి కరణ్‌ జోహార్‌ నిర్మాత. మరాఠీ మూవీ ‘సైరాట్' రీమేక్‌గా రూపొందుతున్న ఈ ప్రేమకథలో జాహ్నవికి జోడీగా ఇషాన్‌ ఖట్టర్‌ నటిస్తున్నాడు.

  English summary
  Sridevi's daughter Janhvi Kapoor, who is all set to make her Bollywood debut with Karan Johar's Dhadak, is now the face of Vogue's June 2018 issue. While the magazine cover was unveiled a couple of days ago, Vogue has now shared a few pictures from the photoshoot which are spreading like wildfire on the internet. Many are extending their support to the aspiring actress but quite a few are also expressing their displeasure on social media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more