అతడొద్దు... ఇతడితో ముద్దు సీన్ అయితే ఓకే: జాహ్నవి కపూర్ హాట్ కామెంట్
'ధడక్' మూవీ ద్వారా నటిగా తెరంగ్రేటం చేసిన శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత సోషల్ మీడియాలో జాహ్నవిని ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరిగింది. తొలి చిత్రం తర్వాత సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.
తాజాగా జాహ్నవి కపూర్ తన సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి ప్రముఖ బాలీవుడ్ నటి నేహా ధూపియా హోస్ట్ చేస్తున్న 'బిఎఫ్ఎఫ్స్ విత్ వోగ్' కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సిస్టర్స్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అతడొద్దు... ఇతడితో ముద్దు సీన్ అయితే ఓకే
ఈ షోలో నేహా ధూపియా... జాహ్నవి కపూర్‌పై ఓ ఆసక్తికర ప్రశ్న సంధించింది. విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్... ఈ ఇద్దరిలో ఎవరి ముద్దు సీన్ కోసం ఎంచుకుంటారు అనే ప్రశ్నకు నిర్మొహమాటంగా ‘విక్కీ కౌశల్' అని సమాధానం ఇచ్చింది.

కరణ్ జోహార్ మూవీలో విక్కీ, జాహ్నవి
జాహ్నవి కపూర్, విక్కీ కౌశల్ త్వరలో కరణ్ జోహార్ రూపొందించబోయే ప్రతిష్టాత్మక చిత్రం ‘తక్త్'లో నటించబోతున్నారు. ఈ ఏడాదే ఈ మూవీ ప్రారంభం కాబోతోంది. మోఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది. ఇందులో జాహ్నవి కపూర్ మోఘల్ ప్రిన్సెస్ నదియా బాను బేగం పాత్రలో, విక్కీ కౌశల్ ఔరంగజేబు పాత్రలు కనిపించబోతున్నారు.

జాహ్నవి కపూర్
‘తక్త్' మూవీతో పాటు జాహ్నవి కపూర్... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదటి ఉమెన్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తోంది. రొటీన్ సినిమాలకు భిన్నమైన కథలు ఎంచుకుంటూ నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది జాహ్నవి.

విక్కీ కౌశల్
గతేడాది నుంచి విక్కీ కౌశల్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. 2018లో రాజి, సంజు, మన్మర్జియాన్, లవ్ ఫర్ స్కేర్ ఫుట్ చిత్రాలతో పాటు ‘లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. 2019 విక్కీ నటించిన ‘యురి: ది సర్జికల్ స్టైక్స్' సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











