వీడియో: జాన్వీ కపూర్ కళ్ళు చెదిరే డ్రెస్.. అమ్మడికి చుక్కలు కనిపించాయిగా!
Recommended Video

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జాన్వీ కపూర్ నటించిన తొలి చిత్రం ధఢక్ ఏ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంలోనే జాన్వీ తన నటన, హావభావాలతో ఆకట్టుకుంది. మొదటి చిత్రమే కావడంతో పెద్ద గ్లామర్ షో చేయలేదు. తదుపరి చిత్రాల్లో అందాల ఆరబోతుకు తాను సిద్ధం అంటూ జాన్వీ సంకేతాలు పంపుతోంది. తాజాగా జాన్వీ కపూర్ వోగ్ ఉమెన్ అవార్డ్స్ వేడుకలో కళ్ళు చెదిరే డ్రెస్ లో దర్శనమిచ్చింది.

నటనతో మంచి మార్కులు
శ్రీదేవి కుమర్తెగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఆ స్థాయిలో కాకున్నా నటన పరంగా తనలో కూడా సత్తా ఉందని ధఢక్ చిత్రంతో నిరూపించుకుంది. కారం జోహార్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాస్త ఆలస్యమైనా మరో మంచి సినిమా చేయాలనే ఆలోచనలో జాన్వీ కపూర్ ఉన్నట్లు తెలుస్తోంది.

వోగ్ అవార్డ్స్ వేడుకలో మెరుపులు
తాజాగా జరిగిన వోగ్ ఉమెన్ అవార్డ్స్ వేడుకలో జాన్వీ కపూర్ మెరుపులు మెరిపించింది. తనలోని గ్లామర్ అస్త్రాన్ని బయటకు తీసింది. జాన్వీ కపూర్ హాట్ లుక్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. పాదాల క్రింద వరకు నేలపై పరచి ఉన్న డ్రస్ లో అదరగొట్టింది. ఈ వేడుకలో జాన్వీ కపూర్ లుక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

వైరల్ అవుతున్న వీడియో
డ్రెస్ బాగానే ఉంది కానీ ఈ అమ్మడికి మాత్రం చుక్కలు కనిపించాయి. నెలవరకు ఉన్న డ్రెస్ తో అడుగు తీసి అడుగు వేయడం కూడా జాన్వికి కష్టంగా మారింది. రెడ్ కార్పెట్ వద్ద మీడియా ఫొటోలకు ఫోజులు ఇచ్చే సమయంలో జాన్వీ ఇబ్బందులు ఎదుర్కొంది. డ్రెస్ ని ఎంత అడ్జెస్ట్ చేసుకున్నా కుదర్లేదు. దీనితో పక్కనేవారు వచ్చి జాన్వీ డ్రెస్ ని అడ్జెస్ట్ చేశారు.

ఇషాన్ ఖట్టర్‌తో
తన తొలి సినిమా ధఢక్ హీరో ఇషాన్ ఖట్టర్ తో కూడా జాన్వీ ఫోజులు ఇచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ తదుపరి కూడా కరణ్ జోహార్ నిర్మాణంలోనే ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











